ధర తగ్గిన షావోమి రెడ్మి Y2 స్మార్ట్ ఫోన్: ఇపుడు రూ. 8,999 ధరతో ప్రారంభం

HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 3 జీబి ర్యామ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ .8,999 మాత్రమే.

ముఖ్యాంశాలు:

1. షావోమి రెడ్మి Y2 Rs 1,000 శాశ్వత ధర కట్ అందుకుంది.

2. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 3 జీబి ర్యామ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ .8,999 మాత్రమే

3. ఈ డివైజ్ యొక్క 4GB RAM మోడల్ ధర రూ .10,999.

గడచినా వారంలో,  షావోమి యొక్క మూడవ ప్రకటన ప్రకారంగా,  Xiaomi Redmi Y2 స్మార్ట్ ఫోను శాశ్వత ధర కట్ అందుకుంది. ఈ సంస్థ భారతదేశంలో ఐదు సంవత్సరాల విజయోత్సవాన్ని జరుపుకుంటుంది మరియు ఐదు ఆశ్చర్యకరమైన ప్రకటనలు చేస్తుంది. Redmi Y2 స్మార్ట్ ఫోనులో ధర తగ్గింపు మూడవ ప్రకటన మరియు ఫోన్ యొక్క 3GB RAM + 32GB స్టోరేజి వెర్షన్ ధర రూ .9,999గా ఉండగా, ఇపుడు ఇది రూ .8,999 ధరతో సెటిల్ అయ్యింది. ఈ హ్యాండ్ సెట్ యొక్క 4GB RAM + 64GB స్టోరేజి వేరియంట్ ఇప్పుడు 11,999 నుంచి రూ .10,999 ధరకు దిగివచ్చింది.  రెడ్మి Y2 అనేది సెల్ఫీ-సెంట్రిక్ స్మార్ట్ఫోన్, ఇది గత సంవత్సరం జూన్ నెలలో భారతదేశంలో ప్రారంభించబడింది. లాంచ్ సమయంలో, దాని 3GB మరియు 4GB RAM మోడళ్ల ధర రూ .10,499 మరియు రూ .13,999గ వుంది.

స్పెసిఫికేషన్ల పరంగా, ఈ రెడ్మి Y2 ఒక 5.99 అంగుళాల HD + డిస్ప్లేని కలిగి ఉంది మరియు 14nm స్నాప్డ్రాగెన్ 625 SoC 2GHz వద్ద క్లాక్ చేయబడుతుంది. ఈ స్మార్ట్ఫోన్లో 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని f / 2.0 ఎపర్చరుతో అమర్చారు. ముందు కెమెరా కంపెనీ "సూపర్ పిక్సెల్" ప్రాసెసును అందుకుంది, ఇది నాలుగు పిక్సెల్లను కలిపి  పెద్దదిగా మిళితం చేస్తుంది, కానీ ఇది నిజానికి పిక్సెల్ బిన్నింగ్. వెనుక భాగంలో, 12MP + 5MP డ్యూయల్ కెమెరా సెటప్పును కలిగి ఉంది, ఇది బొకే చిత్రాలను సంగ్రహిస్తుంది. అదనంగా, ఈ స్మార్ట్ఫోన్ MIUI 9.5 పై నడుస్తుంది, ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆధారంగా, ఇది 3080mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది.

పైన పేర్కొన్న విధంగా, Redmi Y2 ధర డ్రాప్ ఈ వారంలో Xiaomi యొక్క మూడవ ప్రకటన. సంస్థ గతంలో Mi A2 మరియు రెడ్మి నోట్ 5 ప్రో స్మార్ట్ ఫోన్ల  పైన  ధరలు తగ్గించింది. మి A2 యొక్క 4GB RAM + 64GB నిల్వ వెర్షన్ ఇప్పుడు రూ. 13,999 వద్ద ఉంది, అంతకుముందు జాబితాలో ఉన్న ధర రూ. 15,999 నుండి తెగింపు పొందింది. ఈ ఫోన్ యొక్క 6GB + 128GB వేరియంట్ కూడా రాయితీ పొందింది మరియు రూ .18,999 నుండి రూ .15,999 వరకు అమ్మకం అవుతుంది. గతంలో విడుదల చేసిన ధర రూ. 13,999 నుంచి రెడ్మి నోట్ 5 ప్రో కూడా రూ .12,999 ధరకి తగ్గించబడింది, దీని 4 జీబి ర్యామ్, 64 జీబి వేరియంట్. ఈ ఫోను యొక్క 6GB RAM + 64GB స్టోరేజ్ మోడల్ ఇప్పుడు రూ. 13,999 గా ఉంది. అయితే, దీని ముందస్తు ధర రూ .15,999.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :