షావోమి A2 పైన మరొకసారి ధర తగ్గంపు : ఎప్పుడూ లేనంత తక్కువ ధర

Updated on 27-Jun-2019
HIGHLIGHTS

షావోమి ఇప్పుడు ఈ ఫోన్ పైన మరొక సారి డిస్కౌంట్ ప్రకటించింది.

ఇండియాలో ముందుగా, 15,999 ధరతో వచ్చినటువంటి, Mi A2 స్మార్ట్ ఫోన్ పైన అనేకసార్లు డిస్కౌంట్ ప్రకటించినప్పటికీ, ఇది 11,999 ధర వద్ద స్థిరంగా అమ్ముడవుతోంది. కానీ, షావోమి ఇప్పుడు ఈ ఫోన్ పైన మరొక సారి డిస్కౌంట్ ప్రకటించింది. ఇప్పుడు mi వెబ్సైట్ నుండి కేవలం రూ.10,999 ధరకే అందుతుంది. అయితే, 6GB ర్యామ్ వేరియంట్ పైన మాత్రం ఎటువంటి మార్పును చేయలేదు ఇది రూ. 15,999 ధరతో లభిస్తుంది.    

షావోమి Mi A2  స్పెసిఫికేషన్స్

డిజైన్ పరంగా, మీ ఎ2 రెడ్ మీ నోట్ 5 ప్రో ను పోలి ఉంటుంది. ఇది కార్నింగ్  గొరిల్లా గ్లాస్ 5 ద్వారా రక్షించబడింది ఇంకా ఇది 18: 9 యాస్పెక్ట్ రేషియో తోకూడిన  ఒక 5.99 అంగుళాల FHD+ డిస్ప్లేని కలిగి ఉంది.  అలాగే ఈ డివైజ్ 2.2GHz ఆక్టా  కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 చిప్సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు నిలువుగా అమర్చిన డ్యూయల్ – కెమెరా సెటప్ వెనుకభాగంలో ఉంటాయి.

ఆప్టిక్స్ పరంగా చూస్తే, ఈ Mi A2 లో, 1.25 – మైక్రాన్  పిక్సల్స్ అందించగల ఒక 12MP సోనీ IMX486 సెన్సార్ కెమేరా ప్రధానమైందిగాను మరియు  మరొక 20MP సోనీ IMX376 సెన్సార్ ద్వితీయ కెమేరాగాను కలిగి ఉంది.  ఇది పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీకి చక్కగా అనుమతిస్తుంది. ఈ రెండు లెన్సులుకూడా f /1.75 ఎపర్చరును కలిగి ఉంటాయి. ముందు భాగంలో, షియోమీ యొక్క సూపర్ పిక్సెల్ టెక్నాలజీగల 20MP  సోనీ IMX376 సెన్సార్  కెమెరాని అందించారు. అలాగే ఇది క్విక్ ఛార్జ్ 4+ కు మద్దతు ఇచ్చే ఒక 3,000 mAh బ్యాటరీతో, ఈ హ్యాండ్సెట్ మద్దతు ఇస్తుంది. ఈ డివైనులో,  ఒక 3.5mm హెడ్ఫోన్ మాత్రం  మీరు మిస్ అవుతారు అయితే దీనికి బదులుగా, ఇది ఒక USB టైప్- C పోర్ట్ కలిగి వస్తుంది.                  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :