ఇటీవల, HMD గ్లోబల్ గొప్ప ఫీచర్లతో రూ. 8990 రుపాయల ప్రారంభధరలో తీసుకొచ్చినటువంటి, నోకియా 3.2 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కేవలం.7,530 ధరకే లభిస్తోంది. ఇప్పటివరకూ వచ్చిన నోకియా ఫోన్లలో ఇదే అత్యంత చౌకయిన ఫోనుగా చెప్పొచ్చు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్నుఅమెజాన్ ఇండియా తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన మాత్రేమే ఈ రూ. 7,530 ధరకు అమ్ముడు చేస్తోంది. HMD గ్లోబల్ ఇండియాలో తన NOKIA 3.2 స్మార్ట్ ఫోన్నుఒక వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే, డేడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ మరియు 4000mAh బ్యాటరీ వంటి ప్రత్యేకతలతో, అత్యంత చౌకధరతో విడుదల చేసింది.
నోకియా 3.2 – 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజి వేరియంట్ – అఫర్ ధర Rs.7,530 ఇక్కడ నుండి కొనండి ( LINK )
ఈ స్మార్ట్ ఫోనుతో పాటుగా వోడాఫోన్ మరియు ఐడియా వినియోగదారులకి 2500 రుపాయల విలువగల క్యాష్ బ్యాక్ అఫర్ అందుబాటులో ఉంటుంది. ఇది 50 రుపాయల విలువగల 50 వోచర్ల రూపంలో అందిస్తుంది. కేవలం 199 రుపాయల్ రీఛార్జ్ మరియు అంతకంటే ఎక్కువ ధరతో రీఛార్జ్ చేయడంతో ఈ వోచరును వాడుకోవచ్చు.
ఈ నోకియా 3.2 స్మార్ట్ ఫోన్, 1520 x 720 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.26 అంగుళాల HD + వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో మరియు 19:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది. ఇది నోకియా వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో వచ్చిన రెండవ స్మార్ట్ ఫోనుగా ఉంటుంది. ఇది ఒక ప్లాస్టిక్ బాడీతో, బ్లాక్ మరియు స్టీల్ వంటి రెండు రంగుల ఎంపికలతో వస్తుంది. ఈ ఫోన్ ఒక క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 429 ప్రోసెసరుకు జతగా 2GB లేదా 3GB ర్యామ్ శక్తితో వస్తుంది మరియు 16GB లేదా 32GB స్టోరేజి తో వస్తుంది.ముఖ్యంగా, ఒక డేడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ ఇందులో అందించింది.
ఇక కెమేరా విభాగానికి వస్తే, ఇందులో కేవలం f /2.2 అపర్చరు గల ఒకే ఒక్క 13MP కెమేరాని అందించింది. అలాగే, సెల్ఫీ కోసం ఈ ఫోన్ ముందు భాగంలో ఒక 5MP సెల్ఫీ కెమెరాని అందించింది. అధనంగా, ఇది ఒక 10W చార్జరుతో పాటుగా 4000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీతో రెండురోజుల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 రోజుల వరకు ఈ స్మార్ట్ ఫోన్ను వాడుకోవచ్చని సంస్థ చెబుతోంది. ఇది ఆండ్రాయిడ్ వన్ కార్యక్రంమంలో భాగంగా తీసుకొచ్చింది కాబట్టి, అన్ని అప్డేట్లు ముందుగా అందుకలుంటుంది మరియు Android 9 Pie OS తో బాక్స్ నుండి వస్తుంది.