Motorola One Power ఇండియాలో సెప్టెంబర్ 24 న విడుదల కానుంది

HIGHLIGHTS

మోటరోలా ట్విట్టర్ లో ప్రకటన చేసింది. Motorola One Power రెండు వేరియంట్లలో 3GB RAM + 32GB స్టోరేజి మరియు 4GB RAM + 64GB స్టోరేజిలను భారతదేశంలో ప్రారంభించనుంది.

Motorola One Power ఇండియాలో సెప్టెంబర్ 24 న విడుదల కానుంది

మోటరోలా రెండు స్మార్ట్ఫోన్లు, మోటరోలా వన్ మరియు మోటరోలా పవర్ వన్లను ఐఎఫ్ఎలో ఈ ఏడాది ప్రారంభించింది, ఆ సమయంలో ఈ హ్యాండ్సెట్లు ఇండియాలో   త్వరలోనే వస్తాయని కంపెనీ ప్రకటించింది. లెనోవోకు చెందిన ఈ కంపెనీ ప్రస్తుతం ఖచ్చితమైన తేదీని ఇచ్చింది. సెప్టెంబరు 24 న భారతదేశంలో మోటరోలా పవర్ వన్   ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ హ్యాండ్సెట్ 3 జిబి, 4 జీబి ర్యామ్ మోడళ్లలో 32 జీబి, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మోటో వన్ పవర్ ఒక 6.2 అంగుళాల పూర్తి HD + 19: 9 "మాక్స్ విజన్" డిస్ప్లేలో ఒక నోచ్ తో ప్రదర్శించబడుతుంది. స్మార్ట్ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 636 ద్వారా ఆధారితమైనది, ఇది Adreno 509 GPU తో గ్రాఫిక్స్కు మద్దతు ఇస్తుంది. కెమెరా విధులు చుస్తే 16MP + 5MP డ్యూయల్ – వెనుక కెమెరా సెటప్ f / 2.0 ఎపర్చరు మరియు 1.12μm పిక్సెల్స్ తో ఇవ్వబడతాయి. ముందు, ఒక f / 2.2 ఆపేర్చేర్ గల పోర్ట్రైట్ మోడ్కు మద్దతు ఇచ్చే 8MP సెన్సార్ ఉంది. హ్యాండ్సెట్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది మరియు టర్బోపవర్ ఛార్జర్కు మద్దతు ఇస్తుంది, దీని 15 నిమిషాల ఛార్జింగ్ దాదాపుగా 6 గంటల వినియోగాన్ని అందించగలదని కంపెనీ పేర్కొంది.

ఈ స్మార్ట్ఫోన్ Google యొక్క Android One ప్రోగ్రామ్లో చేర్చబడింది కాబట్టి సకాలంలో సాఫ్ట్వేర్ అప్డేట్లు మరియు భద్రతా ప్యాచ్లను పొందడానికి కట్టుబడి ఉంటుంది. ఇది Android Oreo తో రన్ అవుతుంది మరియు త్వరలోనే 9.0 పై అప్డేట్ అందిస్తామని సంస్థ వాగ్దానం చేసింది . మోటోలా వన్ పవర్లో అదే ఫీచర్లు పంచుకునే  మోటరోలా P30 నోట్ ని మోటో ఇటీవల చైనాలో విడుదల చేసింది. స్టాక్ ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్కు బదులుగా, స్మార్ట్ఫోన్ ZUI 4.0 పై నడుస్తుంది, ఇది చివరిగా నిలిపివేయబడిన Zuk సిరీస్ స్మార్ట్ఫోన్ల్లో కనిపించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo