జియో ఫోన్ 2 కొనాలనుకునేవారికి శుభవార్త

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 16 Apr 2020
జియో ఫోన్ 2 కొనాలనుకునేవారికి  శుభవార్త

#IBMCodePatterns, a developer’s best friend.

#IBMCodePatterns provide complete solutions to problems that developers face every day. They leverage multiple technologies, products, or services to solve issues across multiple industries.

Click here to know more

Advertisements

మంచి ఫీచర్లతో కేవలం రూ.2,999 ధరలో QWERTY కీబోర్డు, నాలుగు-మార్గాల నావిగేషన్ కీ, 512ఎంబీ ర్యామ్ మరియు 4జీబీ వంటి ప్రత్యేకతలతో తీసుకొచ్చినటువంటి, జియోఫోన్ 2 ఫీచర్ ఫోన్ను కొనాలనుకునేవారికి  శుభవార్త. జియో సంస్థ, ఇప్పుడు తక్కువ EMI ఎంపికతో అమ్ముడు చేస్తోంది. కేవలం నెలకు రూ. 141 రూపాయల కనిష్ట నెలసరి చెల్లింపుతో ఈ ఫోన్ను మీ సొంతం చేసుకోవచ్చు.    ఇప్పటివరకు జరిగిన అమ్మకాలలో అత్యధికమైన అమ్మకాలను సాధించిన ఈ ఫోను వినియోగధారులకి మంచి ప్రయోజనాలను అందించే ఆఫర్లతో వస్తుంది.

అఫర్ ఈ ( https://www.jio.com/en-in/jiophone2 ) ద్వారా చెక్ చెయవచ్చు.  

జియోఫోన్ 2 స్పెషిఫికేషన్స్ మరియు ఫీచర్స్

జియోఫోన్ 2 లో గుర్తించదగిన మార్పులలో ఒకటిగా QWERTY కీబోర్డుగా చెప్పవచ్చు, ఇది నాలుగు-మార్గాల నావిగేషన్ కీతో ఉంటుంది, ఇది పాత బ్లాక్ బెర్రీ ఫోన్లను మనకు గుర్తుకు  తెస్తుంది.  ఈ డివైజ్ క్షితిజసమాంతర వీడియో వీక్షణను అందించే 2.4-అంగుళాల QVGA డిస్ప్లే మరియు డ్యూయల్ - సిమ్ మద్దతును అందిస్తుంది. అయితే ఇందులో 4జి  వోల్టి(voLTE) స్లాట్ లో జియో ని మాత్రమే వాడుకునే వీలుతో పాటు 2జి స్లాట్ తో రెండవ ఇతర ఆపరేటర్ సిమ్ ని వాడుకోవచ్చు.

ఈ ఫోన్ 512ఎంబీ ర్యామ్ మరియు 4జీబీ  అంతర్గత స్టోరేజ్ తో వస్తుంది, ఇది మైక్రో SD కార్డుని ఉపయోగించి 128జీబీ వరకు మరింతగా విస్తరించే వీలుంది. . జియోఫోన్ మాదిరిగానే, జియోఫోన్ 2 కూడా KAI OS పై నడుస్తుంది మరియు ఇది 2,000 mAh శక్తిగల బ్యాటరీని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 1GHz డ్యూయల్-కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు 2ఎంపీ రియర్ కెమేరా వెనుక మరియు 0.3 ముందు కెమెరాని ఈ డివైజ్ కలిగివుంటుంది.

కనెక్టవిటీ విషయానికి వస్తే , వోల్టి(voLTE)  కు మద్దతు ఇస్తుంది, అయితే, ఇది VoWiFi కు మద్దతు ఇస్తుంది మరియు మల్టీమీడియా బ్రాడ్కాస్ట్ మల్టికాస్ట్ సర్వీస్ (eMBMS) ను కూడా అభివృద్ధి చేస్తుంది. ఫోన్ NFC, Wi-Fi కనెక్టివిటీ, బ్లూటూత్ తక్కువ శక్తికి కూడా మద్దతు ఇస్తుంది మరియు దీనిలో FM రేడియో అంతర్నిర్మితంగా ఉంటుంది.

యాప్స్ మద్దతు గురించి చూస్తే , ఈ జీయోఫోన్ 2 అన్ని జియో యాప్స్ కి మద్దతిస్తుంది:మై జియో, జియో మ్యూజిక్,  జియో సినిమా,జియో ఎక్సప్రెస్ న్యూస్, వాయిస్ అసిస్టెంట్,జియో వీడియో కాల్, జియో గేమ్స్ లాంటివి. ఇంకా కావాల్సిన పేస్ బుక్యా, యు ట్యూబ్,మరియు వాట్సాప్  వంటివాటిని జియో స్టోర్ నుండి పొందేవీలుంది.

జియోఫోన్ 2 ప్లాన్స్

రిలయన్స్ జీయో నుంచి నాలుగు ప్లాన్స్ తో జియోఫోన్ 2 ని జతచేసారు. రూ .99 ప్లాన్, 14 జీబి డేటా, ఫ్రీ కాలింగ్, 300 ఎస్ఎంఎస్, జీయో యాక్సెస్ కి 28 రోజులు అందుబాటులో ఉంటుంది. జియో నుండి రూ .153 ప్లాన్ ద్వారా, 42జీబీ డేటా, ఉచిత కాలింగ్, జీయో యాప్స్  కి యాక్సెస్, మరియు ఉచిత అపరిమిత ఎస్ఎంఎస్, 28 రోజులు విశ్వసనీయ చెల్లుబాటుతో  అందిస్తుంది. అలాగే, రూ .153 ప్లాన్ మరియు రూ .594 ప్లాన్లు కూడా వున్నాయి. 

logo
Raja Pullagura

Tags:
jiophone 2
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status