Nothing Phone (3a) Lite launched with new design and features
Nothing Phone (3a) Lite స్మార్ట్ ఫోన్ ను ఈరోజు గ్లోబల్ మార్కెట్ లో నథింగ్ విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్ మరియు అల్యూమినియం ఫ్రేమ్ తో వచ్చింది. ఇప్పటికే ఫోన్ 3 సిరీస్ నుంచి మూడు ఫోన్లు విడుదల చేసిన నథింగ్ ఇప్పుడు మరొక ఫోన్ ను ఇదే సిరీస్ నుంచి విడుదల చేసింది. ఈసారి నథింగ్ ఫోన్ 3 సిరీస్ నుంచి 3a లైట్ ఫోన్ ను విడుదల చేసింది.
నథింగ్ ఫోన్ 3a లైట్ స్మార్ట్ ఫోన్ ను ఈ సిరీస్ లో ఎన్నడూ చూడని ఒక సరికొత్త డిజైన్ లో అందించింది. ఈ ఫోన్ కేవలం 199 గ్రాముల బరువుతో చాలా లైట్ ఉంటుంది. అయితే, ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 33 W ఫాస్ట్ ఛార్జ్ మరియు 5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ మీడియా టెక్ లేటెస్ట్ చిప్ సెట్ Dimensity 7300 Pro 5G తో లాంచ్ అయ్యింది. ఈ ప్రోసెసర్ కి జతగా 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ బూస్టర్ ఫీచర్ తో కూడా వస్తుంది.
ఈ లేటెస్ట్ నథింగ్ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 6.77 ఇంచ్ ఫ్లెక్సిబుల్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. నథింగ్ ఫోన్ 3a లైట్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు మరో కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, TrueLens Engine, నైట్ మోడ్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ముందు మరియు వెనుక రెండు వైపులా పాండా గ్లాస్ రక్షణ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ IP54 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ Nothing OS 3.5 సాఫ్ట్ వేర్ పై ఆండ్రాయిడ్ 15 OS తో నడుస్తుంది మరియు త్వరలోనే ఆండ్రాయిడ్ 16 OS అప్డేట్ అందుకుంటుంది. ఈ ఫోన్ 3 సంవత్సరాల మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 6 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది.
Also Read: భారీ డిస్కౌంట్ తో 25 వేలకే లభిస్తున్న Xiaomi 55 ఇంచ్ 4K Smart Tv
ఈ ఫోన్ ను గ్లోబల్ మార్కెట్లో EU €249 (సుమారు రూ. 26,000) ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్లాక్ అండ్ వైట్ రెండు రంగుల్లో లభిస్తుంది.