Nothing Phone (2a) ఫోన్ పై రూ. 3,000 డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన Flipkart.!
ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు Nothing Phone (2a) ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. 25 వేల ఉప బడ్జెట్ లో గొప్ప ఫీచర్స్ తో వచ్చిన ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ తో 20 వేల ఉప బడ్జెట్ లోనే లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ ను అందుకోవడానికి ఒక కండిషన్ వుంది. ఆ కండిషన్ ఏమిటి మరియు ఈ ఫోన్ ఫీచర్లు ఏమిటో తెలుసుకుందామా.
SurveyNothing Phone (2a) : ఆఫర్
నథింగ్ ఫోన్ (2a) బేసిక్ వేరియంట్ ఈరోజు రూ. 22,999 ధరతో సేల్ అవుతోంది. అలాగే, ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ రూ. 26,999 ధరకు లభిస్తుంది. ఇందులో ఏమైంది కండిషన్ లేదా ఆఫర్ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఈ ఫోన్ ను HDFC క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 3,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ HDFC బ్యాంక్ ఆఫర్ ఈ ఈ ఫోన్ కొనుగోలు చేసే యూజర్లు ఈ ఫోన్ ను రూ. 3,000 డిస్కౌంట్ తో అందుకోవచ్చు. అంటే, ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను కేవలం రూ. 19,999 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు.
Also Read: Redmi A4 5G ఫోన్ ను Snapdragon 4 Gen 2 తో అనౌన్స్ చేసిన షియోమీ.!
Nothing Phone (2a) : ఫీచర్స్
ఈ నథింగ్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7200 Pro చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 8GB / 12GB ఫిజికల్ ర్యామ్, 8GB ర్యామ్ బూస్ట్ మరియు 128GB / 256GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి వుంది. ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 ఇంచ్ 10 బిట్ ఫ్లెక్సిబుల్ AMOLED స్క్రీన్ ను HDR 10+ సపోర్ట్ తో కలిగి వుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP + 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 32MP Sony సెల్ఫీ కెమెరాని కల్గి ఉంటుంది. ఈ ఫోన్ తో 30 fps 4K వీడియోలు షూట్ చేయవచ్చు. ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ కూడా వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
