నోకియా X7 ఫోన్ ని నోకియా 7.1 ప్లస్ కు బదులుగా నోకియా 8.1 గా పరిచయం చేయవచ్చు ప్రపంచవ్యాప్తంగా

నోకియా X7 ఫోన్ ని నోకియా 7.1 ప్లస్ కు బదులుగా నోకియా 8.1 గా పరిచయం చేయవచ్చు ప్రపంచవ్యాప్తంగా
HIGHLIGHTS

ఈ నోకియా 8.1 స్మార్ట్ ఫోన్ నోకియా X7 వంటి అదేవిధమైన ప్రొసెసర్ తో గీక్ బెంచ్ లో కనిపించింది.

HMD గ్లోబల్ గత కొంత కాలంగా, తన x సిరీస్ స్మార్ట్ ఫోన్లను రీ-బ్రాండింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఈ ధోరణిలో ముందుగా వచ్చిన, నోకియా X5 మరియు నోకియా X6 లను వరుసగా నోకియా 5.1 ప్లస్ మరియు నోకియా 6.1 ప్లస్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. అదే వరుస క్రమంలో ఇటీవలే చైనాలో విడుదల చేసిన, నోకియా X7 స్మార్ట్  ఫోన్ని ప్రపంచవ్యాప్తంగా  నోకియా7.1 ప్లస్ గా విడుదల చేస్తుందని అనుకుంటున్నారు. అయితే, నోకియా టిప్స్టర్ Nokia anew @nokiamobileru ప్రకారంగా, ఈ పేరును కొత్తగా రానున్న మరొక పరికరానికి రిజర్వు చేసినట్లు మరియు ఈ ఫోన్ కోసం నోకియా 8.1 ని ఖాయం చేయనున్నట్లు కంపెనీ యొక్క చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ అయిన, జుహో సర్వికస్ తెలియచేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్తగా రానున్న పరికరాన్ని MWC 2019 సమయలో ప్రకటిస్తామని, అందుకోసంమే ఈ నోకియా నోకియా X7 ని  ప్రపంచవ్యాప్తంగా నోకియా 8.1 గా విదుదల చేయనున్నట్లు కూడా తెలిపారు.

దీనికి అదనంగా, HMD గ్లోబల్ యొక్క నోకియా 8.1 స్మార్ట్ ఫోన్  గీక్ బెంచ్ లో కనబడింది. ఈ లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్710 SoC, 4GB ర్యామ్ తో శక్తినిస్తుంది మరియు ఆండ్రాయిడ్ 9 పై తో నడుస్తుందని తెలుస్తోంది. ఈ నోకియా X7 స్మార్ట్ ఫోన్ కూడా ఇలాంటి ప్రాసెసర్ మరియు సాఫ్ట్ వేర్ తో నడుస్తుంది కాబట్టి,  ఈ నోకియా X7 ఫోన్నే నోకియా 8.1 గా రీ బ్రాండింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారన్న మాటకి బలాన్ని చేకూర్చింది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే, దీని హార్డ్ వేర్ పరంగా ఈ నోకియా 8 సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఎగువ మధ్య స్థాయి పరిధిలోకి వస్తాయి మరియు నోకియా 9 ప్యూర్ వ్యూ తో కంపెనీ యొక్క కొత్త లైన్ అప్ గా ఉంటాయి. అయితే, ఈ విషయాన్నీకంపెనీ నిర్ధారించలేదు వచ్చిన రూమర్లు మరియు వివరాలతో, విశదీకరించాము.

నోకియా X7 ప్రత్యేకతలు 

ఈ నోకియా X7 ఒక 6.18-అంగుళాల పూర్తి HD + 'PureDisplay' HDR 10 మద్దతుతో మరియు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 710 ప్రాసెసర్ చేత శక్తిని  పొందింది . ఈ పరికర డిస్ప్లే 18.7: 9 కారక నిష్పత్తిని మరియు 86.5 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగి ఉంటుంది. ఇది 6GB RAM మరియు 128GB అంతర్గత నిల్వ వరకు వస్తుంది, ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 400GB వరకు విస్తరించబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక డ్యూయల్ – కెమెరా సెటప్ మరియు ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది, ఇది 2.5D కర్వ్డ్ గ్లాస్ నుండి తయారు చేయబడింది.

ఆప్టిక్స్ ప్రకారం, ఈ నోకియా X7 ఒక 13MP ప్రాధమిక IMX363 సెన్సార్ను f / 1.8 ఎపర్చరుతో కలిగి ఉంటుంది, వెనుకవైపు ఉన్న జెయిస్ ఆప్టిక్స్ తో 12MP సెకండరీ సెన్సార్ను కలిగి ఉంటుంది. ముందు, ఇది f / 2.0 ఎపర్చరు లక్షణాలతో ఒక 20MP షూటర్కు స్పోర్ట్ చేస్తుంది. ఈ నోకియా X7,  3,500mAh బ్యాటరీతో వేగవంతమైన  ఛార్జింగ్కు మద్దతిస్తుంది, ఇది 18W ఛార్జర్తో కూడినది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo