నోకియా లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Nokia G20 అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి మంచి ఆఫర్లతో అమ్ముడవుతోంది. ఇండియాలో రూ.12,999 రూపాయల ధరతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మరింత చవక ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ అమెజాన్ సేల్ చివరి రోజు నుండి 500 రూపాయల డిస్కౌంట్ తో రూ.12,490 రూపాయల ధరకే అమ్ముడవుతోంది. అధనంగా, రూ. 500 రూపాయల కూపన్ అఫర్ కూడా ఉంది. SBI కార్ద్స్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy from Here
నోకియా జి 20 స్మార్ట్ ఫోన్ 4x2.3 GHz, 4x1.8 GHz ఆక్టా-కోర్ మీడియాటెక్ Helio G35 ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ శక్తివంతమైన ప్రొసెసర్ కి జతగా 4 జీబీ ర్యామ్ కూడా ఉంది. కాబట్టి, మెమరీ-ఇంటెన్సివ్ యాప్స్ వాడే సమయంలో కూడా ఈ ఫోన్ సజావుగా నడుస్తుంది. ఈ ఫోన్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. కానీ, ఈ ఫోన్ లో స్టోరేజ్ ను పెంచడానికి ఎటువంటి అప్షన్ లేదు. కాబట్టి, నోకియా జి 20 ను ఎన్నుకునేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.
నోకియా జి 20 పెద్ద 6.5-అంగుళాల స్క్రీన్ వస్తుంది మరియు దానికి మద్దతు ఇవ్వడానికి తగిన శక్తివంతమైన 5050 mAh బ్యాటరీతో కూడా వస్తుంది. ఈ డిస్ప్లే HD+ (1600 X 720) రిజల్యూషన్‌తో ఉంటుంది.
నోకియా జి 20 లో క్వాడ్ రియర్ కెమెరా వుంది. ఇందులో, కెమెరా సిస్టమ్ 48 + 5+ 2 + 2 మెగాపిక్సెల్ తో వుంటుంది మరియు 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ f / 1.8 కెమెరా ఎపర్చరును కలిగి ఉంది. ఇది హై డైనమిక్ రేంజ్ (HDR) ఇమేజింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.