అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి Nokia G20 ఫోన్ భారీ ఆఫర్లతో లభిస్తోంది

అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి Nokia G20 ఫోన్ భారీ ఆఫర్లతో లభిస్తోంది
HIGHLIGHTS

Nokia G20 అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తోంది

నోకియా జి20 పైన బెస్ట్ ఆఫర్స్

లేటెస్ట్ ఫీచర్లతో వచ్చిన నోకియా బడ్జెట్ స్మార్ట్ ఫోన్

నోకియా లేటెస్ట్ గా ఇండియాలో ఆవిష్కరించిన Nokia G20 స్మార్ట్ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తోంది. నోకియా జి20 స్మార్ట్ ఫోన్ రూ.12,999 రూపాయల ధరతో ఇండియాలో ప్రకటించబడింది. కానీ, అమెజాన్ సేల్ నుండి ఈ స్మార్ట్ ను 1,000 రూపాయల కూపన్ మరియు SBI కస్టమర్లకు 10% డిస్కౌంట్ మరియు మరిన్ని లాభాసాటి ఆఫర్లతో పొందవచ్చు. Nokia G20 స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ సేల్ నుండి 12 వేల రూపాయల వరకూ భారీ ఎక్స్ చేంజ్ కూడా పొందవచ్చు. Buy from Here 

Nokia G20: ఫీచర్లు

నోకియా జి 20 స్మార్ట్‌ ఫోన్ 4×2.3 GHz, 4×1.8 GHz ఆక్టా-కోర్ మీడియాటెక్ Helio G35 ప్రాసెసర్‌ శక్తితో పనిచేస్తుంది. ఈ శక్తివంతమైన ప్రొసెసర్ కి జతగా 4 జీబీ ర్యామ్ కూడా ఉంది. కాబట్టి, మెమరీ-ఇంటెన్సివ్ యాప్స్ వాడే సమయంలో కూడా ఈ ఫోన్ సజావుగా నడుస్తుంది. ఈ ఫోన్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. కానీ, ఈ ఫోన్ లో స్టోరేజ్ ను పెంచడానికి ఎటువంటి అప్షన్ లేదు. కాబట్టి, నోకియా జి 20 ను ఎన్నుకునేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నోకియా జి 20 పెద్ద 6.5-అంగుళాల స్క్రీన్‌ వస్తుంది మరియు దానికి మద్దతు ఇవ్వడానికి తగిన శక్తివంతమైన 5050 mAh బ్యాటరీతో కూడా వస్తుంది. ఈ డిస్ప్లే HD+ (1600 X 720) రిజల్యూషన్‌తో ఉంటుంది.

నోకియా జి 20 లో క్వాడ్ రియర్ కెమెరా వుంది. ఇందులో,  కెమెరా సిస్టమ్ 48 + 5+ 2 + 2 మెగాపిక్సెల్ తో వుంటుంది మరియు 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్  f / 1.8 కెమెరా ఎపర్చరును కలిగి ఉంది. ఇది హై డైనమిక్ రేంజ్ (HDR) ఇమేజింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo