Nokia G11: 50MP కెమెరాతో వచ్చిన నోకియా కొత్త ఫోన్..!

Nokia G11: 50MP కెమెరాతో వచ్చిన నోకియా కొత్త ఫోన్..!
HIGHLIGHTS

Nokia G11 ఇండియాలలో విడుదల

ఈ ఫోన్ లో 50MP డ్యూయల్ కెమెరా వుంది

యాడ్స్ బెడద లేని Stock Android 12 OS ఈ ఫోన్ సొంతం

HMD Global యజమాన్యంలోని నోకియా ఇండియాలో G సిరీస్ నుండి మరొక కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. అదే , Nokia G11 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను 50MP కెమెరా మెరియు ఎటువంటి యాడ్స్ బెడదా లేని Stock Android 12 OS వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇండియన్ మర్కెట్లో ప్రవేశపెట్టింది.  బడ్జెట్ యూజర్లను ఆకర్షించే విధంగా ఈ స్మార్ట్ ఫోన్ ధరను కూడా ఉంచింది. ఈ లేటెస్ట్ నోకియా స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో చూద్దాం.                 

Nokia G11: ఫీచర్లు

నోకియా జి 11 స్మార్ట్‌ ఫోన్ Unisoc T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ శక్తితో పనిచేస్తుంది. ఈ ప్రొసెసర్ కి జతగా 4 జీబీ ర్యామ్ మరియు 64ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. కాబట్టి, మెమరీ-ఇంటెన్సివ్ యాప్స్ వాడే సమయంలో కూడా ఈ ఫోన్ సజావుగా నడుస్తుంది. ఈ ఫోన్ లో స్టోరేజ్ ను పెంచడానికి మైక్రో SD అప్షన్ వుంది. Nokia G11 పెద్ద 6.5-అంగుళాల HD+ స్క్రీన్‌ తో వస్తుంది మరియు ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ డిస్ప్లే మరియు ఫోన్ కు పవర్ ఇవ్వడానికి తగిన శక్తివంతమైన 5000 mAh బ్యాటరీతో కూడా వస్తుంది.

నోకియా జి 11 లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరా మరియు 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా వుంది. ఈ స్మార్ట్ ఫోన్  f / 1.8 కెమెరా ఎపర్చరును కలిగి ఉంది. ఇది హై డైనమిక్ రేంజ్ (HDR) ఇమేజింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.  ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ బెడదా లేని Stock Android 12 OS పైన నడుస్తుంది మరియు రెండు మేజర్ అప్డేట్స్ ను అందుకుంటుంది.

Nokia G11: Price

నోకియా జి11 కేవలం 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ కలిగిన సింగిల్ వేరియంట్ తో వస్తుంది మరియు దీని ధర రూ.12,499. ఈ ఫోన్ చార్కోల్ గ్రే మరియు లేక్ బ్లూ అనే రెండు కలర్ అప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ త్వరలోనే ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులోకి వస్తుందని నోకియా తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo