Nokia C12: నోకియా చవక స్మార్ట్ ఫోన్ సేల్ మొదలయ్యింది.!

Updated on 28-Mar-2023
HIGHLIGHTS

నోకియా లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Nokia C12 ఇప్పుడు సేల్ కి అందుబాటులోకి వచ్చింది

ఈ ఫోన్ అమెజాన్ నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది

ఈ నోకియా ఫోన్ తన అకర్షణీయమైన డిజైన్ తో ఆకట్టుకుంటుంది

నోకియా లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Nokia C12 ఇప్పుడు సేల్ కి అందుబాటులోకి వచ్చింది. నోకియా బ్రాండ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ Android 12 (Go edition) OS పైన పనిచేస్తుంది. అంతేకాదు, ఈ నోకియా ఫోన్ తన అకర్షణీయమైన డిజైన్ తో కూడా ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ నుండి లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర స్పెక్స్ మరియు ఫీచర్లు ఇక్కడ చూడవచ్చు.              

Nokia C12: ధర

Nokia C12 స్మార్ట్ ఫోన్ ను 2GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో నోకియా లాంచ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్ నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. Buy From Here 

Nokia C12: స్పెక్స్

నోకియా సి12 స్మార్ట్ ఫోన్ 6.3 ఇంచ్ డిస్ప్లేని HD+ రిజల్యూషన్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది మరియు ఇందులో  5MP సెల్ఫీ కెమేరాతో ఉంటుంది. ఈ ఫోన్ Unisoc SC9863A ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. జతగా 2GB ర్యామ్ కి జతగా 2GB వర్చువల్ RAM మరియు 64GB స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. Nokia C12 స్మార్ట్ ఫోన్  Android 12 (Go edition) OS పైన పనిచేస్తుంది. 

ఈ స్మార్ట్ ఫోన్ వెనుక కేవలం 8MP సింగిల్ కెమేరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ 3,000mAh రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇక ఇతర ఫీచర్ల పరంగా, 4G VoLTE, Wi Fi, బ్లూటూత్ 5.2, 3.5 mm ఆడియో జాక్ ను కలిగివుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :