నోకియా లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Nokia C12 ఇప్పుడు సేల్ కి అందుబాటులోకి వచ్చింది. నోకియా బ్రాండ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ Android 12 (Go edition) OS పైన పనిచేస్తుంది. అంతేకాదు, ఈ నోకియా ఫోన్ తన అకర్షణీయమైన డిజైన్ తో కూడా ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ నుండి లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర స్పెక్స్ మరియు ఫీచర్లు ఇక్కడ చూడవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Nokia C12: ధర
Nokia C12 స్మార్ట్ ఫోన్ ను 2GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో నోకియా లాంచ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్ నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. Buy From Here
నోకియా సి12 స్మార్ట్ ఫోన్ 6.3 ఇంచ్ డిస్ప్లేని HD+ రిజల్యూషన్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది మరియు ఇందులో 5MP సెల్ఫీ కెమేరాతో ఉంటుంది. ఈ ఫోన్ Unisoc SC9863A ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. జతగా 2GB ర్యామ్ కి జతగా 2GB వర్చువల్ RAM మరియు 64GB స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. Nokia C12 స్మార్ట్ ఫోన్ Android 12 (Go edition) OS పైన పనిచేస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ వెనుక కేవలం 8MP సింగిల్ కెమేరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ 3,000mAh రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇక ఇతర ఫీచర్ల పరంగా, 4G VoLTE, Wi Fi, బ్లూటూత్ 5.2, 3.5 mm ఆడియో జాక్ ను కలిగివుంది.