ఫుల్ వ్యూ డిస్ప్లే తో Nokia మొదటి ఫోన్ Nokia 7 Plus

ఫుల్ వ్యూ డిస్ప్లే తో  Nokia మొదటి ఫోన్  Nokia 7 Plus

నోకియా 7 ప్లస్ స్మార్ట్ఫోన్ యొక్క స్పెక్స్ గురించి అనేక లీక్స్ వచ్చాయి . బార్సిలోనాలో జరిగిన MWC కార్యక్రమంలో నెల చివరిలో ఈ ఫోన్లను ప్రారంభించవచ్చని చెప్పబడుతోంది. HMD గ్లోబల్ యొక్క నాయకత్వం తిరిగి వచ్చిన తరువాత, నోకియా తాజా స్మార్ట్ఫోన్ ట్రెండ్ పై దృష్టి పెట్టింది మరియు లీక్స్  ప్రకారం నోకియా 7 ప్లస్ ని యూనివిజం డిస్ప్లే  మరియు డ్యూయల్ కెమెరా సెటప్తో ప్రారంభించవచ్చు.

రాబోయే నోకియా 7 ప్లస్ స్మార్ట్ఫోన్ సిరామిక్ అల్లికతో అల్యూమినియం బాడీని కలిగి ఉండవచ్చని చెప్పబడుతోంది.  వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్  సెన్సార్తో డ్యూయల్ కెమెరా సెటప్ అవకాశం ఉంది. ఫోన్  డిస్ప్లే 6 అంగుళాల FHD + (2160×1080 పిక్సెల్స్) 18: 9 యాస్పెక్ట్ రేషియో  మరియు గొరిల్లా గ్లాస్తో ఉందని  భావిస్తున్నారు. నోకియా 7 ప్లస్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660 ద్వారా ఆధారితం కావచ్చు. ఈ ఫోన్ 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో రావచ్చు, మైక్రోఎస్డీ కార్డు ద్వారా విస్తరించవచ్చు.

ఫోన్ యొక్క వెనుక వైపు డ్యూయల్  కెమెరా మాడ్యూల్ ఉంటుంది. డ్యూయల్  వెనుక కెమెరా  12MP + 13MP సెన్సార్ కాంబినేషన్ మరియు 2X ఆప్టికల్ జూమ్ అమర్చారు అని భావిస్తున్నారు. ఫోన్ ముందు కెమెరా 16MP (మెగాపిక్సెల్) ఉంటుంది.దీనితో పాటు, ఫోన్ యొక్క బ్యాటరీ క్విక్  ఛార్జ్ మద్దతుతో ఉంటుంది, వెనుక వైపు ఒక USB టైప్ సి పోర్ట్ మరియు ఫింగర్ ఆరింటి  సెన్సార్ ఉంటుంది. ఆశాజనముగా , HMD గ్లోబల్  MWC లో తన ఫ్లాగ్షిప్  స్మార్ట్ఫోన్ నోకియా 9 ప్రారంభించగలదు.

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo