Amazon ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ నుండి NOKIA 6.2 పైన భారీ డిస్కౌంట్

Amazon ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ నుండి NOKIA 6.2 పైన భారీ డిస్కౌంట్
HIGHLIGHTS

నోకియా 6.2 స్మార్ట్ ఫోన్ మంచి కెమేరా ప్రత్యేకతలతో విడుదలయ్యింది.

గత నెలలో IFA 2019 సందర్భంగా తీసుకొచ్చిన నోకియా 6.2 స్మార్ట్ ఫోన్ మంచి కెమేరా ప్రత్యేకతలతో విడుదలయ్యింది. HMD గ్లోబల్ సంస్థ ఈ నోకియా 6.2 ఫోన్ను ఒక మిడ్ రేంజ్ ఫోనుగా తీసుకొంచింది. ఈ ఫోన్ను రూ.15,999 రూపాయల ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. అయితే, ఈరోజు నుండి అమేజాన్ ఇండియా ఆన్లైన్ ప్లాట్ఫారం పైన ఈరోజు నుండి జరుగనున్న అమేజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ నుండి ఈ ఫోన్ను కేవలం రూ.13,999 ధరకే అమ్ముడిచేస్తోంది.

అధనంగా, HDFC బ్యాంక్ డెబిట్ కార్డుతో ఈ ఫోన్ను కొనుగోలు చేసినట్లయితే, 10% క్యాష్ బ్యాక్ ను అందుకోవచ్చు. అంటే, ఈ 1,399 రుపాయల్ క్యాష్ బ్యాక్ మీకు దొరుకుతుంది. ఈ పరంగా చుస్తే, కేవలం 12,600 రుపాయల ధరకే మీకు ఈ ఫోన్ లభిస్తుంది.               

నోకియా 6.2 ప్రత్యేకతలు

ఈ  నోకియా 6.2 స్మార్ట్ ఫోన్ HDR 10 మద్దతు ఇవ్వగల ఒక 6.3-అంగుళాల FHD + డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 3 యొక్క రక్షణను కలిగి ఉంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇది ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్‌ కి జతగా 4 GB ర్యామ్‌ మరియు 64 GB ఇంటర్నల్ స్టోరేజితో వస్తుంది. ఒక డేడికేటెడ్ మెమొరీ కార్డుతో దీని స్టోరేజిని 512 GB వరకూ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ 3,500 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడుతుంది మరియు డ్యూయల్ సిమ్‌తో కూడిన ఈ నోకియా ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై OS తో నడుస్తుంది.

ఈ నోకియా 6.2 లో, వెనుక  f/1.8 ఎపర్చర్ కలిగిన ఒక ప్రధాన 16MP కెమేరాకు జతగా ఒక 8 MP అల్ట్రా వైడ్ సెన్సారు మరియు 5MP డెప్త్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమేరాని అందించారు. అలాగే, ముందుభాగంలో ఒక 8MP సెల్ఫీ కెమెరాని ఇచ్చారు.  ఈ నోకియా 6.2 యొక్క ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 128 జిబి వరకు ఉంది. కనెక్టివిటీ ఫీచర్లలో వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ 5.0, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, జిపిఎస్ మరియు 4G LTE  వంటివి ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo