నోకియా 5G స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది

నోకియా 5G స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది
HIGHLIGHTS

నోకియా 5G స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది

అప్ కమింగ్ నోకియా 5G స్మార్ట్‌ఫోన్‌

5G రేసులో Nokia గ్లోబల్ కాలుపెట్టనుంది

నోకియా ఫోన్ తయారీ సంస్థ HMD గ్లోబల్ తన మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న 5G రేస్ లో ఈ అప్ కమింగ్ నోకియా 5G స్మార్ట్‌ఫోన్‌ తో చేరుతుంది. ఇప్పటికే చాలా స్మార్ట్ ఫోన్ కంపెనీలు 5G రేసులో ముందంజలో ఉన్నాయి. రియల్ మీ మరియు షియోమి కంపెనీలు బడ్జెట్ ధరలో కూడా తమ 5G స్మార్ట్‌ఫోన్‌ లను మార్కెట్లో ప్రవేశపెట్టాయి.  నవంబర్ 11 న సింగిల్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆరోజు చైనీయులకు పేద షాపింగ్ కాలం. అందుకే, అదే రోజున ఈ ఫోన్‌ను చైనా మార్కెట్లో మాత్రమే లాంచ్ చేయవవచ్చు.

నోకియా 9.3 పేరిట కంపెనీ ఈ ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని పలు నివేదికలు చెప్పినప్పటికీ, భారతీయ లాంచ్ లేదా ఫోన్ ధర ఇంకా తెలియలేదు.

వాస్తవానికి, 2020 మార్చిలోనే నోకియా తన మొదటి 5 జి ఫోన్ నోకియా 8.3 5G కోసం పనిచేస్తున్నట్లు తెలిపింది. అయితే, అప్పటి నుండి ఈ ఫోన్ గురించి ఎటువంటి సమాచారం తెలియరాలేదు. కానీ, కొన్ని కొత్త రిపోర్ట్స్ ప్రకారం నోకియా 5G ఫోన్ కోసం పనిచేస్తోంది.

HMD గ్లోబల్ గతకొంతకాలంగా నోకియా 9.3 ప్యూర్‌ వ్యూ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయాలని యోచిస్తోంది, అయితే, నోకియా యొక్క కొత్త 5 జి స్మార్ట్‌ఫోన్ నోకియా 9.3 ప్యూర్‌ వ్యూ కావచ్చునని పలు నివేదికలు సూచిస్తున్నాయి.

నోకియా యొక్క ప్రొడక్ట్ మేనేజర్ జాంగ్ యుచెంగ్ సంస్థ యొక్క కొత్త ఫోన్ గురించి వెల్లడించారు. నోకియా యొక్క మొట్టమొదటి 5 జి స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయవచ్చని హెచ్‌బిడి గ్లోబల్ అధికారి వీబోలో వినియోగదారులతో సంభాషణ సందర్భంగా చెప్పారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo