సూపర్ ఫీచర్లతో వచ్చిన NOKIA 5.3 స్మార్ట్ ఫోన్

సూపర్ ఫీచర్లతో వచ్చిన NOKIA 5.3 స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

ఇది 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్‌తో వస్తుంది.

నోకియా 5 ఫోన్ 2018 లో తీసుకురాబడింది  మరియు గత సంవత్సరం ఈ సిరీస్‌ నుండి ఏ ఫోన్ కూడా రాలేదు. అయితే, ఇప్పుడు ఈ సిరీస్ మళ్లీ తిరిగి వచ్చింది మరియు ఇది చాలా అప్డేట్స్ తో వచ్చింది.

ఇప్పుడు ఈ సిరీస్ నుండి నోకియా 5.3 గొప్ప డిజైన్‌ తో వస్తుంది మరియు కుకీ కెమెరా సెటప్‌తో వస్తుంది. డిస్ప్లేలో వాటర్‌డ్రాప్ నాచ్‌ లో సెల్ఫీ కెమెరా మరియు వెనుక ప్యానెల్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఈ నోకియా 5.3, సియాన్, శాండ్ మరియు బొగ్గు రంగులలో వస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఒక 6.55-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది. ఇది 720p రిజల్యూషన్ ప్యానెల్. ఈ నోకియా 5.3 లో క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌ సెట్ ఉంది మరియు ఇది 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్‌తో వస్తుంది.

ఫోన్ వెనుక భాగంలో 13 MP  ప్రైమరీ కెమెరా, 2MP  డెప్త్ సెన్సార్, 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌ లో 8 MP  సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

ఈ నోకియా 5.3 ఒక పెద్ద 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. కాని, ఇది కేవలం 10W ఛార్జింగ్ టెక్నాలజీకి  మాత్రమే మద్దతిస్తుంది. ఇది కాకుండా, ఈ ఫోనులో బ్లూటూత్ 5.0 కు బదులుగా బ్లూటూత్ 4.2 ఉంది. ఈ నోకియా 5.3 లో  ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో మరియు డేడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ వంటివి ఉన్నాయి.

నోకియా 5.3 ఏప్రిల్‌ నుండి విక్రయించబడుతుంది మరియు దీని ధర €189 (సుమారు రూ.15,252). ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 మరియు 12 లకు అప్‌గ్రేడ్ అవుతుంది మరియు 3 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్లను కూడా పొందుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo