పేటియమ్ మాల్ లో అమ్మకానికి అందుబాటులో నోకియా 5.1,నోకియా 2.1 మరియు నోకియా 3.1(3జీబీ ర్యామ్)

పేటియమ్ మాల్ లో అమ్మకానికి అందుబాటులో నోకియా 5.1,నోకియా 2.1 మరియు నోకియా 3.1(3జీబీ ర్యామ్)
HIGHLIGHTS

నోకియా 2.1 రూ . 6,999 కి లభించనుంది, 3జీబీ ర్యామ్ తో కూడిన నోకియా 3.1 ధర రూ .11,999 మరియు నోకియా 5.1 రూ .14,499 రేటుతో పేటియమ్ మాల్ లో అందుబాటులో వున్నాయి.

కొత్తగా ప్రారంభించిన నోకియా 2.1, నోకియా 3.1 (3 జిబి ర్యామ్) మరియు నోకియా 5.1 అమ్మకాలు పేటియమ్ మాల్ లో ప్రారంభించబడ్డాయి. గత వారంలో హెచ్ ఎమ్ డి  గ్లోబల్ నోకియా 5.1 (నోకియా 5 2018) రూ .14,999, నోకియా 2.1 (నోకియా 2 2018) రూ .6,999 ధరలతో  ప్రారంభించింది. నోకియా 5.1 అనేది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ వన్  ప్రోగ్రామ్ కింద లభించే ఒక ఆండ్రాయిడ్  Oreo స్మార్ట్ ఫోన్ మరియు నోకియా 2.1 అనేది ఆండ్రాయిడ్ Oreo (గో ఎడిషన్) డివైజ్. ఈ నోకియా హక్కుదారు  నోకియా 2.1 మరియు 5.1 తో పాటుగా 3GB RAM వేరియంట్ ని  కూడా ఆవిష్కరించారు.

 మూడు ఫోన్లలో, పేటియమ్ రీఛార్జ్ మరియు బిల్లు చెల్లింపులతో 10 శాతం క్యాష్ బ్యాక్ ని ఆఫర్ చేసింది. నోకియా 5.1 మరియు నోకియా 3.1 పై ICICI బ్యాంక్ డెబిట్ / క్రెడిట్ కార్డు హోల్డర్లకు 5 శాతం క్యాష్ బ్యాక్ తో పాటు అనేక ప్రయోగ ఆఫర్లతో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.   మేము పేటియమ్ మాల్ పై చివరిసారి తనిఖీ చేసినప్పుడు, నోకియా 2.1 మరియు నోకియా 5.1 స్మార్ట్ ఫోన్లు ఇప్పటికే స్టాక్ లో లేవు, కానీ స్టాక్స్ త్వరలో తిరిగి భర్తీ అవుతాయి. నోకియా యొక్క అధికారిక వెబ్సైట్లో, మీరు మీ పిన్ కోడ్ లు ఉంచడం ద్వారా పరికరాలను కొనుగోలు చేయవచ్చు. ఈ వెబ్సైట్ స్మార్ట్ ఫోన్ లభ్యతను తనిఖీ చేస్తుంది మరియు అందుబాటులో ఉన్నట్లయితే, మీరు మీ కార్ట్ లో ఫోన్ ని యాడ్ చేసుకోవచ్చు. మూడు స్మార్ట్ఫోన్ల ఎగుమతులను ఈరోజు నుంచి ప్రారంభిస్తారు (ఆగస్టు 13).

 నోకియా 5.1 స్పెసిఫికేషన్స్

ఈ నోకియా 5.1 18:9 యాస్పెక్ట్ రేషియో తో పాటుగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తో ప్రోటెక్ట్ చేయబడిన ఒక 5.5-అంగుళాల ఫుల్ హెచ్ డి+ డిస్ప్లే ని కలిగివుంది. ఈ డివైజ్ ఆక్టా – కోర్ మీడియా టెక్ 6755ఎస్ శక్తితో  పనిచేస్తుంది మరియు ఇది 3జీబీ ర్యామ్ మరియు 32జీబీ స్టోరేజి తో వస్తుంది. ఆప్టిక్స్ పరంగా చూస్తే, ఇందులో ఫేజ్ డిటెక్షన్ ఆటో ఫోకస్ (PDAF) తో కూడిన 16ఎంపీ సింగల్ కెమేరాతో పాటుగా డ్యూయల్ – టోన్ ఫ్లాష్ ని వెనుక భాగంలో కలిగివుంది. 8ఎంపీ వైడ్ – యాంగిల్ కెమేరా ని ముందు భాగంలో ఉంచారు. ఈ మొత్తం ప్యాకేజీకి అనుగుణంగా 3,000 mAh బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ కాపర్ ,టెంపర్డ్ బ్లూ మరియి నలుపు రంగులలో లభిస్తుంది.        

నోకియా 3.1 స్పెసిఫికేషన్స్

ఈ నోకియా 3.1 ఫోన్ గత నెలలోనే ఇండియాలో విడుదల చేయబడింది, కానీ కంపెనీ ఇప్పుడు కొత్తగా 3జీబీ ర్యామ్ వేరియెంట్ డివైజ్ ని పరిచయం చేస్తుంది. ఈ నోకియా 3.1 ఫోన్ 18:9 యాస్పెక్ట్ రేషియో తో కూడిన ఒక 5.2-అంగుళాల హెచ్ డి డిస్ప్లే ని కలిగివుంది.ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ 6750 ఆక్టా – కోర్ చిప్సెట్ తో వస్తుంది. దీని కెమేరా విషయానికి వస్తే ,ఇదిఎల్ ఈ డి ఫ్లాష్ తో పాటు  f/2.0 ఎపేర్చరు తో కూడిన ఒక 13ఎంపీ కెమేరాని ఫోన్ వెనుక భాగంలో కలిగివుంది. ముందుభాగంలో వైడ్ – యాంగిల్ కి సపోర్ట్ చేసే ఒక 8ఎంపీ సెన్సార్ ని అందించారు. ఇంకెలా దీనిలో 2,990 mAh శక్తి గల బ్యాటరీని కలిగివుంది.

నోకియా 2.1 స్పెసిఫికేషన్స్

ఈ నోకియా 2.1 కంపెనీ యొక్క రెండవ ఆండ్రాయిడ్ oreo (గో ఎడిషన్) స్మార్ట్ ఫోన్. ఈ నోకియా 2.1 ఫోన్ కంటే ముందువచ్చిన వాటికంటే 50 శాతం అధిక పనితీరుని కనబరుస్తుందని కంపెనీ వివరించింది. ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 425 SoC శక్తితో పనిచేస్తుంది ఇంకా ఇది 16:9 యాస్పెక్ట్ రేషియో తో కూడిన ఒక 5.5-అంగుళాల హెచ్ డి డిస్ప్లే ని ఫీచర్ గా కలిగివుంది. ఇది క్రిందా పైన బెజెల్స్ కలిగిన రెండు  స్పీకర్లని ముందు భాగంలో కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ 1జీబీ ర్యామ్ మరియు 8జీబీ అంతర్గత మెమొరీ (128జీబీ వరకుపెంచుకునే) సామర్ధ్యం తో అందించబడింది. ఇంకా ఇందులో 4,000 mAh శక్తిగల పెద్ద బ్యాటరీని ఇచ్చారు ,ఇది రెండురోజుల వరకు బ్యాటరీ లైఫ్ ని అందించగలదని కంపెనీ గట్టిగా చెబుతుంది. అలాగే, ఆటో ఫోకస్ తో కూడిన 8ఎంపీ రియర్ కెమేరాని వెనుక భాగంలో ప్రధాన కెమేరాగాను మరియు 5ఎంపీ సెన్సార్ ని ముందు భాగంలో అందించారు. ఈ ఫోన్ బ్లూ/కాపర్ ,బ్లూ/సిల్వర్ మరియు గ్రే/సిల్వర్ కలర్ మోడల్స్ లో లభిస్తుంది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo