ఇండియాలో విడుదలైన నోకియా 2.3 స్మార్ట్ ఫోన్ : ధర, ప్రత్యేకతలు మరియు పూర్తి వివరాలు

ఇండియాలో విడుదలైన నోకియా 2.3 స్మార్ట్ ఫోన్ : ధర, ప్రత్యేకతలు మరియు పూర్తి వివరాలు
HIGHLIGHTS

ఈ స్మార్ట్‌ ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై OS పైన నడుస్తుంది మరియు ఇది ఆండ్రాయిడ్ 10 కి అప్‌ గ్రేడ్ చేయబడుతుందని కంపెనీ తెలిపింది.

నోకియా ఇటీవలే తన కొత్త ఎంట్రీ లెవల్ నోకియా 2.3 స్మార్ట్‌ ఫోన్ను విడుదల చేసింది. కైరోలో జరిగిన ఒక కార్యక్రమంలో దీనిని ప్రకటించారు, కానీ ఇప్పుడు, ఈ స్మార్ట్ ఫోన్ను భారతదేశంలో కూడా విడుదల చేశారు. ఈ హ్యాండ్‌ సెట్ ఆండ్రాయిడ్ 9 OS పైన నడుస్తుంది, ఈ ఫోన్ ఒక 6.2-అంగుళాల డిస్ప్లే ను కలిగి ఉంది మరియు ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్‌ కూడా కలిగి ఉంటుంది. భారతదేశంలో,ఈ హ్యాండ్‌సెట్ 10 K  పరిధిలోకి వస్తుంది, అంటే అదే ధర పరిధిలో రియల్మీ 5, రెడ్మి 8 మరియు ఇటువంటి మరికొన్ని ఇతర ఫోన్లను పోటీగా ఈ ఫోన్ ఉండనుంది. ఈ కొత్త నోకియా స్మార్ట్‌ ఫోన్ గురించి మీరు తెలుసుకోవలసిన మూడు కొత్త విషయాలు ఇక్కడ అందిస్తున్నాను.

నోకియా 2.3 ప్రత్యేకతలు 

నోకియా 2.3 ఫోన్ ఒక 6.2-అంగుళాల డిస్ప్లేతో 720 x 1520 పిక్సెల్ రిజల్యూషన్ మరియు 19: 9 డిస్ప్లే యాస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది. ఇది 2GHz క్వాడ్-కోర్ మీడియాటెక్ హెలియో A22 SoC చేత శక్తినిస్తుంది మరియు 2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజితో వస్తుంది. ఒక మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజిను 512GB వరకు పెంచవచ్చు. ఈ నోకియా 2.3 లో 3.5 mm హెడ్‌ ఫోన్ జాక్ ఉంది మరియు మైక్రో USB తో వస్తుంది. దీని బరువు 183 గ్రాములు ఉంటుంది.

నోకియా 2.3 కెమెరా వివరాలు

ఆప్టిక్స్ విషయానికొస్తే, నోకియా 2.3 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ను ఒక ప్రధాన 13MP సెన్సార్‌తో f / 2.2 ఎపర్చర్‌తో మరియు 2MP డెప్త్ సెన్సార్‌తో కలిపి వుంటుంది. ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమేరా ఉంది. ఇందులో HMD గ్లోబల్ సిఫార్సు చేసిన షాట్ ఫీచర్ గురించి ప్రత్యేకంగా చెబుతోంది.ఇది షట్టర్ ప్రెస్‌ కు ముందు మరియు తరువాత 15 చిత్రాలను తీసుకుంటుంది మరియు తరువాత ఉత్తమ షాట్‌ ను ఎంచుకుంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై OS పైన నడుస్తుంది మరియు ఇది ఆండ్రాయిడ్ 10 కి అప్‌ గ్రేడ్ చేయబడుతుందని కంపెనీ తెలిపింది.

నోకియా 2.3 ధర మరియు లభ్యత వివరాలు

కేవలం 2 జిబి ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ వేరియంట్‌ తో మాత్రమే ఈ నోకియా 2.3 ధర లభిస్తుంది మరియు దీని ధరను రూ .8,199 గా ప్రకటించింది. ఇది డిసెంబర్ 27 నుండి నోకియా ఆన్‌లైన్ షాప్ ద్వారా మరియు క్రోమా, రిలయన్స్, సంగీత, పూర్వికా, బిగ్ సి మరియు మైజి నుండి ఆఫ్‌ లైన్‌ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

ఈ నోకియా 2.3 ను కొనుగోలు చేసే జియో చందాదారులకు కంపెనీ 7,200 రూపాయల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. కానీ, కేవలం రూ .249 మరియు 349 ధరల ప్లాన్లతో రీఛార్జ్ చేసేటప్పుడు ఈ ప్రయోజనం లభిస్తుంది మరియు మొత్తం ప్రయోజనంలో రూ .2,200 క్యాష్ బ్యాక్, రూ .3,000 క్లియర్‌ట్రిప్ వోచర్లు మరియు జూమ్‌కార్‌పై రూ .2,000 తగ్గింపు వంటి ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్ కొత్త మరియు ఇప్పటికే ఉన్న జియో చందాదారులకు వర్తిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo