REALME C2 కోసం కొత్త అప్డేట్ : తాజా ఫీచర్లు సూపర్

REALME C2 కోసం కొత్త అప్డేట్ : తాజా ఫీచర్లు సూపర్
HIGHLIGHTS

ఆప్టిమైజ్డ్ స్మార్ట్ అసిస్టెంట్ ఇంటర్‌ఫేస్ కూడా అప్‌డేట్‌లో లభిస్తుంది.

రియల్మీ తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ C 2 స్మార్ట్‌ ఫోన్ కోసం భారతదేశంలో కొత్త అప్‌ డేట్‌ విడుదల చేసింది. ఈ అప్డేట్ ల, గూగుల్ డిజిటల్ వెల్ బీయింగ్, రీ డిజైన్   రూపకల్పన నోటిఫికేషన్ సెంటర్ మరియు కొన్ని మెరుగుదలలు ఉన్నాయి. ఈ తాజా అప్డేట్ RMX1941EX_11.A.17 వెర్షన్ నంబర్‌తో వస్తుంది మరియు సెప్టెంబర్ 2019 సెక్యూరిటీ ప్యాచ్‌ను కలిగి ఉంటుంది. ఈ అప్డేట్ లో మాన్యువల్ లాక్ ఫీచర్ అందుబాటులో ఉంటుందని అధికారిక చేంజ్లాగ్ సూచిస్తుంది. అదనంగా, వినియోగదారులు హాట్‌స్పాట్ యొక్క నెట్‌వర్క్ వేగాన్ని మాన్యువల్ కి పరిమితం చేయవచ్చు.

ఇప్పుడు ఈ కొత్త అప్డేట్ ద్వారా రియల్మి సి 2 యూజర్లు డిజిటల్ వెల్ బీయింగ్ ఫీచర్‌ను  పొందుతున్నారు. ఇది కాకుండా, లాక్ స్క్రీన్ క్లాక్ విడ్జెట్ మరియు వెదర్ విడ్జెట్ అప్‌డేట్‌లో ఆప్టిమైజ్ చేయడంతో పాటు ఆప్టిమైజ్డ్ స్మార్ట్ అసిస్టెంట్ ఇంటర్‌ఫేస్ కూడా అప్‌డేట్‌లో లభిస్తుంది.

రియల్మీ C2 ప్రత్యేకతలు

రియల్మీ C2  స్మార్ట్ ఫోన్, ఒక 6.1 అంగుళాల HD డ్యూ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 89%  స్క్రీన్-టూ-బాడీ రేషియోని అందిస్తుంది. ఇది ఒక వాటర్ డ్రాప్ నోచ్ మరియు వెనుక ఒక డైమండ్ కట్ డిజైన్ తో వస్తుంది.  అంతేకాదు,ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక హీలియో P 22 ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా 2GB ర్యామ్ శక్తితో వస్తుంది.ఇది 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజితో వస్తుంది. అలాగే డ్యూయల్ SIM కార్డులతో పాటుగా ఒక SD మెమొరీ కార్డును కూడా ఒకేసారి వాడుకునేలా ట్రిపుల్ SIM స్లాట్ ఇందులో అందించారు.         

కెమేరాల విషయానికి వస్తే, వెనుక 13MP కెమేరాకు జతగా 2MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాతో ఉంటుంది. ఇక సెల్ఫీ కెమేరా విషయానికి వస్తే, ముందుభాగంలో ఒక 5MP  సెల్ఫీ కెమెరాతో ఉంటుంది మరియు ఇది 8 రకాల బ్యూటీ కస్టమ్ మోడ్లతోవస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా కలర్ OS 6 పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో వస్తుంది మరియు దీనితో వేగవంతంగా ఛార్జ్ చెయ్యవచ్చని సంస్థ చెబుతోంది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo