మీరు ఒక PUBG ప్లేయర్ అయితే మీకోసమే ఈ కొత్త న్యూస్.
ఇప్పుడు కొత్త అప్డేట్ అందిచడానికి PUBG సిద్దమవుతుంది.
మీరు ఒక PUBG ప్లేయర్ అయితే మీకోసమే ఈ కొత్త న్యూస్. ఇప్పుడు కొత్త అప్డేట్ అందిచడానికి PUBG సిద్దమవుతుంది. ఈ కొత్త అప్డేట్ బీటా ఇప్పుడు రోల్ అవుట్ చెయ్యబడింది. ఈ బీటా అప్డేట్ 0.13.0 PUBG మొబైల్ కోసం తయారు చేసింది మరియు ఈ కొత్త బీటా వెర్షన్ డౌన్లోడ్ చేసుకోని సైన్ అప్ చేయాల్సివుంటుంది.
1. Team Death Match
ఈ కొత్త అప్డేటుతో ఏఎస్ సరికొత్త ఈవెంట్ మీకు అందించబడుతుంది. ఇది PUBG మొబైల్ కోసం కొత్త రీతుల్లో ఒకటి టీమ్ డెత్ మ్యాచ్ తీసుకొచ్చింది. ఈ పేరు సూచించినట్లుగానే, ఈ మోదులో రెండు జట్ల మధ్య పోటీ సాగుతుంది. ఈ మ్యాచ్ లో డెత్ గురించి మీకు పరిమితి లేదు. ఇవ్వబడిన సమయం ముగిసేలోపుగా ఎన్ని Kills సాధించారు అనేదాని పైనే టీమ్ విజయం ఆధారపడివుంటుంది. ఏదేమైనప్పటికీ, ఈ మ్యాచ్ చాలా తక్కువ సమయంతో ఉంటుంది మరియు ఇది సుమారు 9-10 నిమిషాలలో ముగుస్తుంది. ఈ డెత్ మ్యాచ్ మోడ్ FPP మరియు TPP రెండింటిలో అందుబాటులో ఉంది.
2. గాడ్జిల్లా ఈవెంట్
PUBG మొబైల్ కూడా రాబోయే చలన చిత్రం గాడ్జిల్లా 2: కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఆటగాళ్ళు ఎరాంగెల్ మ్యాప్ లో, ఈ రాకాశిని నీటిలో చూడవచ్చు మరియు ఒక ఈస్టర్ ఎగ్ ని కూడా అందుకుంటారు. అంతేకాదు, ఈ మ్యాప్ లో మీరు అతిపెద్ద పాదముద్రలను కూడా చూడవచ్చు.
3. Bizon Gun
ముందు నుండే PUBG PC లో అందుబాటులో ఉన్నటువంటి ఈ గన్ న్నీ ఇప్పుడు PUBG మొబైల్ లో కూడా అందిస్తుంది. ఇది ఎక్కువ బులెట్లను స్టోరేజ్ చేయగల కెపాసిటితో వస్తుంది.
ఈ కొత్త బీటా 0.13.0 అప్డేటులో భాగమైన ఇతర లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి
FPP కోసం ప్రత్యేకమైన కంట్రోల్ సెట్టింగులు చేర్చబడ్డాయి.
రిజల్ట్స్ లో MVP డిస్ప్లే జోడించబడింది.
జాబితాలో MVP emotes కోసం ట్యాబ్ ను కూడా జోడించారు.
అన్ని అప్పీయరెన్సులు, వాయిసెస్ మరియు emotes వివిధ పోర్టబుల్ అల్మారాలు సెట్ చేయవచ్చు. మ్యాచ్లో ఉన్నప్పుడు వారు కూడా మార్చవచ్చు.
వాకింగ్, క్రాల్ లేదా మంచు మీద వాహనాన్ని నడుపుతున్నప్పుడు, ఇక గుర్తులు కనబడతాయి.
అలాగే మరికొన్ని మెరుగుదలలు కూడా ఉన్నాయి.
ఆర్మర్ మన్నికను 25% తగ్గించవచ్చు (డామేజ్ రిడక్షన్ మాత్రం మారదు).
టైరెంట్, G , లికర్ మరియు జోంబీ కాప్ వంటివి సర్వైవ్ టిల్ డాన్ నుండి తీసివేయబడ్డాయి. అధనంగా, 4 కొత్త జాంబీస్ పరిచయం చేయబడుతుంది.
లిక్విడ్ నైట్రోజన్ మైన్ నుండి చల్లటి పొగమంచు ఇప్పుడు ఎక్కువసేపు ఉంటుంది. దీన్లో నుండి వెళ్లే ప్రతిదీ కూడా నెమ్మదిగా చెయ్యబడుతుంది.
న్యూ బిల్డింగ్ : అబాండన్డ్ ఫ్యాక్టరీ : ఈ బిల్డింగు చాలా రిసోర్సులు కలిగి ఉంది కానీ ఇందులో కొత్త బాస్ కూడా ఉంటాడు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.