Motorola Razr 60 Ultra: పవర్ ఫుల్ ఫీచర్స్ తో విడుదలైన మోటో ఫ్లిప్ ఫోన్.!

HIGHLIGHTS

మోటోరోలా మోస్ట్ పవర్ ఫుల్ Flip ఫోన్ ను ఈ రోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది

Motorola Razr 60 Ultra ను Snapdragon 8 Elite పవర్ ఫుల్ చిప్ సెట్ తో అందించింది

మోటోరోలా ఈ ఫోన్ ను మధ్యకు మడతపెట్టే 6.96 ఇంచ్ ఫోల్డబుల్ AMOLED స్క్రీన్ తో అందించింది

Motorola Razr 60 Ultra: పవర్ ఫుల్ ఫీచర్స్ తో విడుదలైన మోటో ఫ్లిప్ ఫోన్.!

Motorola Razr 60 Ultra: మోటోరోలా మోస్ట్ పవర్ ఫుల్ Flip ఫోన్ ను ఈ రోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8 Elite పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు moto ai వంటి మరిన్ని ఫీచర్స్ తో అందించింది. ఈరోజే ఇండియాలో సరికొత్తగా విడుదలైన మోటోరోలా ఫ్లిప్ ఫోన్ ధర మరియు ఫీచర్లు తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Motorola Razr 60 Ultra: ఫీచర్స్

మోటోరోలా ఈ ఫోన్ ను మధ్యకు మడతపెట్టే 6.96 ఇంచ్ ఫోల్డబుల్ AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ కలిగి ఉంటుంది.ఈ స్క్రీన్ 4500 పీక్ బ్రైట్నెస్, గరిష్టంగా 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ మరియు 120% DCI-P3 కలర్ గాముట్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ వెలుపల HDR10+ సపోర్ట్ కలిగిన 4 ఇంచ్ AMOLED స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ రక్షణతో ఉంటుంది మరియు మెటల్ ఫ్రెమ్ కలిగి ఉంటుంది.

Motorola Razr 60 Ultra

ఈ ఫోన్ ను Snapdragon 8 Elite చిప్ సెట్ తో అందించింది. ఇది 3nm చిప్ సెట్ మరియు ఇది గరిష్టంగా 4.32GHz క్లాక్ స్పీడ్ తో ఉంటుంది. ఈ ఫోన్ 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB (UFS4.0) ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP48 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్ ఫీచర్ తో కూడా వస్తుంది. మోటోరోలా ఈ ఫ్లిప్ ఫోన్ లో 4700 mAh బిగ్ బ్యాటరీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ 68W టర్బో ఛార్జ్, 30W వైర్లెస్ ఛార్జ్ మరియు 5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.

ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ + 50MP అల్ట్రా వైడ్/మ్యాక్రో డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 30fps తో 8K వీడియో రికార్డ్ మరియు 60fps/30fps తో 4K UHD వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ నైట్ విజన్ తో పాటు చాలా AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా అందించింది.

Also Read: లేటెస్ట్ 32 ఇంచ్ QLED Smart Tv మంచి డిస్కౌంట్ తో 8 వేల బడ్జెట్ లో లభిస్తోంది.!

Motorola Razr 60 Ultra: ప్రైస్

మోటోరోలా ఈ ఫోన్ ను కేవలం సింగల్ వేరియంట్ లో రూ. 99,999 ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ ను రూ. 89,999 ధరకే అందుకునేలా రూ. 10,000 భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ప్రధాన బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. మే 21వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile