మోటోరోలా పి30 ప్రీ – ఆర్డర్: స్నాప్ డ్రాగన్ 636 చిప్సెట్ తో ప్రారంభించిన ఈ ఫోన్ చైనాలో ప్రీ – ఆర్డర్ కి అందుబాటులో ఉంది.

మోటోరోలా పి30 ప్రీ – ఆర్డర్: స్నాప్ డ్రాగన్ 636 చిప్సెట్ తో ప్రారంభించిన ఈ ఫోన్ చైనాలో ప్రీ – ఆర్డర్ కి అందుబాటులో ఉంది.
HIGHLIGHTS

మోటోరోలా పి30 స్మార్ట్ ఫోన్ ప్రారంభానికి ముందు ఒకరోజు మోటోరోలా చైనీస్ వెబ్సైట్లో లిస్ట్ చేయబడింది. 6జీబీ ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి వేరియంట్ ధర CNY1,999 (సుమారు రూ .20,000) మరియు 6జీబీ + 128జీబీ స్టోరేజీ వెర్షన్ ధర CNY2,099 (సుమారు రూ .21,000) గా ఉన్నాయి.

చైనాలో అధికారిక వెబ్ సైట్ కి ఒక రోజు తర్వాత, లెనోవో క్వాల్కామ్ యొక్క స్నాప్ డ్రాగన్636 చిప్సెట్ మరియు బోకె ఎఫెక్ట్ కోసం వెనుక డ్యూయల్ – కెమెరాలతో  మోటోరోలా పి30 ను దేశంలో ప్రారంభించింది. స్మార్ట్ ఫోన్ ఐస్ వైట్, బ్రైట్ బ్లాక్, మరియు అరోరా బ్లూ బ్యాక్ ప్యానెల్ రంగులతో అందుబాటులో ఉంది. మోటోరోలా పి30 యొక్క 6జీబీ ర్యామ్  మరియు 64జీబీ స్టోరేజి వేరియంట్  CNY1,999 ధర(సుమారు రూ .20,000), మరియు  6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజి  వెర్షన్ ని CNY2,099ధర తో ఇస్తున్నారు ఇది సుమారు రూ .21,000 కు మారుతుంది. చైనాలో ప్రీ – ఆర్డర్ కి ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది మరియు దాని ప్రపంచ లభ్యత గురించి ఏమాత్రం చెప్పలేదు.

మోటోరోలా పి30 స్పెసిఫికేషన్స్

మోటోరోలా పి30 ఒక  6.2-అంగుళాల IPS LCD డిస్ప్లేను ఫుల్ హెచ్ డి+ రిసల్యూషన్తో కలిగి ఉంది. ఇందులో ఒక నోచ్, ఒక చిన్ మరియు బెజల్లు చాలా సన్నగా ఉన్నాయి. డిస్ప్లే యొక్క యాస్పెక్ట్ రేషియో 19: 9 గా వుంది. స్మార్ట్ ఫోన్ ఒక ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్  636 చిప్సెట్ శక్తిని కలిగి ఉంది, ఇది 1.8 GHz వద్ద క్లాక్ చేయబడి, ఇంకాఅడ్రెనో 509 GPU తో అనుబంధం కలిగి ఉంది. మోటోరోలా 6జీబీ ర్యామ్ తో ఫోన్ ఆవిష్కరించింది కానీ రెండు స్టోరేజి ఎంపికలు వున్నాయి: 64జీబీ  లేదా 128జీబీ. దీని కెమెరా విషయానికి వస్తే, ఫోన్ ఓమ్నివిజన్ అభివృద్ధి చేసిన 16ఎంపీ  + 5ఎంపీ  సెన్సార్లతో ఇది ఐఫోన్ X- వంటి వెనుక డ్యూయల్ -కెమెరా సెటప్ ని కలిగి ఉంటుంది. ప్రాధమిక లెన్స్  f / 1.8 ఎపర్చరును కలిగి ఉంటుంది, ద్వితీయంగా f / 2.2 తో వస్తుంది. కెమెరా PDAF, 1080p వీడియో షూటింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది మరియు డ్యూయల్-టోన్ LED ఫ్లాష్ ఉంది. స్వీయ షూటర్ ఒక సాధారణ 12ఎంపీ సెన్సార్ ని f / 2.0 లెన్స్ మరియు 1.25 um పిక్సెల్ పరిమాణం కలిగి ఉంటుంది.

ఫింగర్ ప్రింట్ స్కానర్ మోటో చిహ్నంతో వెనుకవైపు ఉంచారు. ఆండ్రాయిడ్ ఓరియో 8.0 OS పైన ఫోన్ ZUI 4.0 పై అమలవుతుంది. వినియోగదారు ఇంటర్ఫేస్ ని మొదటగా ZUK స్మార్ట్ ఫోన్లలో ప్రవేశపెట్టారు, ఇవి ఇప్పుడు నిలిపివేయబడ్డాయి. UI స్కిన్ మళ్లీ లెనోవా Z5 లో చూడబడింది. సంస్థ ఈ నెలాఖరు తర్వాత ఐఎఫ్ఎ బెర్లిన్లో సమ్మె,స్మార్ట్ ఫోన్ ని విడుదల చేస్తుందని భావిస్తున్నారు. మోటరోలా పి30 లో ఒక 3.5 mm ఆడియో జాక్, USB- సి పోర్ట్ దిగువన మరియు 18W వేగవంతమైన ఛార్జ్ అవ్వగల 3000 mAh బ్యాటరీతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo