మోటో జెడ్3 స్నాప్ డ్రాగన్ 835 తో విడుదలైంది,మోటో జి5 మోడ్ మాత్రం 2019 ప్రారంభంలో రానుంది

మోటో జెడ్3 స్నాప్ డ్రాగన్ 835 తో విడుదలైంది,మోటో జి5 మోడ్ మాత్రం 2019 ప్రారంభంలో రానుంది
HIGHLIGHTS

మోటో జెడ్3 గత సంవత్సర ఫ్లాగ్ షిప్ క్వాల్కమ్ ప్రాసెసర్ తో విడుదల చేసింది. ఇది 2019 సంవత్సరం పార్రంభంలో విడుదలకానున్న మోటో 5జి కి అనుసంధానం చేయదని సిద్ధంగా ఉందని మోటోరోలా ధ్రువీకరించింది.

మోటో జెడ్3 ఇక్కడ ని ఇక్కడ గమనించవచ్చు,  కానీ ఆండ్రాయిడ్ వన్ తో రానున్న మోటో వన్ పవర్ మరియు మోటో వన్ లు ఈరోజు ఉదయం వేళల్లో జరిగిన మోటరోలా ప్రయోగ కార్యక్రమంలో ఎక్కడా కనపడలేదు. మోటరోలా యొక్క ఫ్లాగ్ షిప్ గా వచ్చిన ఈ డివైజ్ డేటెడ్ చిప్సెట్ ని కలిగి ఉంటుంది. ముందుగా అందరు అంచనా వేసినట్లుగా, మోటో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 తో ఫోన్ ని విడుదల చేయనున్నట్లు అనుకున్నారు.  కానీ, మోటో జెడ్3 ఒక స్నాప్ డ్రాగన్ 835 చిప్సెట్ తో వస్తుంది, ఇది పిక్సెల్ 2, పిక్సెల్ 2 XL, వన్ ప్లస్ 5, వన్ ప్లస్ 5T లాంటి ఫోన్ల ఫ్లాగ్ షిప్ కు సమనమైన ఫ్లాగ్ షిప్. మోటో జెడ్3 ప్రత్యేకత ఏమిటంటే, 2019 సంవత్సరం పార్రంభంలో విడుదలకానున్నమోటో 5జి  కి అనుసంధానం చేయడా

 ని సిద్ధంగావుంది. 2019 సంవత్సరం పార్రంభంలో మోటో 5జి విడుదల చేసేటప్పుడు దీంట్లో క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ X50 మోడెమ్ తో ఇది 5జి వేగ సదుపాయాన్నిస్తుంది.  వచ్చే సంవత్సరానికి వస్తుందని కంపెనీ నిర్ధారించింది.  గత ఏడాది క్వాల్కామ్ ప్రదర్శించిన ఒక ప్రదర్శనలో, ఈ సంస్థ డ్రాగన్ X50 మోడెమ్ తో ఒక రిఫరెన్స్ డిజైన్ లో 5జి కనెక్షతో సెకండ్ కి గిగాబైట్ కంటే ఎక్కువ డౌన్ లోడ్ వేగమున్న 5జి కనెక్షన్ ని ఏర్పాటు చేసింది. మేము మోటో యొక్క 5జి  ప్రణాళికలను మరింతగా చెప్పడానికి ముందు, కొత్తగా విడుదల చేయబడిన మోటో జెడ్3  యొక్క వివరణలను చూద్దాం.

 

మోటో జెడ్3 స్పెసిఫికేషన్స్  మరియు ఫీచర్లు

మోటో జెడ్3 6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే, 2.35 గిగాహెట్జ్ క్లాక్ వేగం కలిగిన స్నాప్ డ్రాగన్ 835 చిప్సెట్ , 4 జీబి ర్యామ్, 64 జీబి పెంచుకోగలిగిన స్టోరేజ్, 12 మెగా పిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా. మీరు మమ్మలి అడిగితే మిల్ స్పెక్స్ తో అందంగా పనిచేస్తుందని చెబుతాము. ఇతర OEM ల నుండి ప్రస్తుత ఫ్లాగ్ షిప్ ఫోన్లలో కనిపించిన విధంగా దేనిలో  నోచ్ డిస్ప్లే  లేదు , కానీ దానికి బదులుగా, మోటో జెడ్3 పైభాగం మరియు దిగువన బెజల్స్ వున్నాయి. జెడ్3 యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ కిందవైపు ఉంటుంది, మోటో జెడ్3 ప్లే లాగా.  ఇంకా,  మోటో జెడ్2 ఫోర్స్ యొక్క షట్టర్ ప్రూఫ్ డిజైన్ ని మోటో జెడ్3 లో కొనసాగించలేదు.  అయితే మోటోరోలా ఈ సంవత్సరం విడుదల చేయనున్న  జెడ్3 ఫోర్స్ ఎడిషన్ ఈ డిజైన్ ఉంటుందని ధ్రువీకరించారు. "మేము ఈ సంవత్సరం ఇంకా ఏవిధమైన మోటో Z యొక్కఎడిషన్ ని విడుదల చేయడ లేదని" సంస్థ దాని అధికారిక యు ఎస్  ట్విట్టర్ ఖాతాలో చెప్పారు.

ముందు చెప్పినట్లుగానే, మోటో జెడ్3 ని ఆండ్రాయిడ్ ఒరేమో 8.1 తో అందించారు.ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ కి మద్దతు ఇస్తుంది మరియు దీనిలో హెడ్ ఫోన్ జాక్ లేకుండా USB-C పోర్ట్ ని కలిగి ఉంది. అయితే ఇందుకు వినియోగదారులు  చింటించాల్సిన అవసరం లేదు, దీని పెట్టెలో ఒక అడాప్టర్ తో పాటుగా వస్తుంది. మొత్తం ప్యాకేజీ కి 3,000mAh  బ్యాటరీతో శక్తిని అందించగలదుమరియు ఈ డివైజ్  స్ప్లాష్-ప్రూఫ్ గా ఉందని చెప్పారు.

 

మోటో జెడ్ 3 ధర మరియు అందుబాటు వివరాలు

ముందుగా , మోటోజెడ్3  స్పెక్స్ అంత  ఎక్కువ ఫ్లాగ్ షిప్ కాకా పోయినప్పటికీ, స్నాప్ డ్రాగన్ 835 ప్రొసెసర్ ఇప్పటికి మార్కెట్లో అత్యుత్తమైనదిగానే ఉంది . నేడు అందుబాటులో ఉన్న అత్యంత ప్రధాన డివైజ్ ల కన్నా ఈ ఫోన్ ధర తక్కువగా ఉంది. మోటోజెడ్3 US లో $ 480 (దాదాపు రూ. 32,954) ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ డివైజ్ ఆగస్టు 16 నుంచి US లో లభ్యమవుతుంది. మోటోజెడ్3 ని భారతదేశంలో విడుదల చేయనున్న తేదీ యింకా తెలియరాలేదు.

మేము లీక్స్ లో చూస్తున్నప్రకారంగా,  మోటో 5జి  మోడ్ చాలా వాస్తవమైనది మరియు  2019 సంవత్సర ప్రారంభంలో ఈ అటాచ్మెంట్ ని విడుదల చేస్తుందని కంపెనీ ధృవీకరించింది. మోటో చేత విడుదల చేయబడిన అన్ని Z సిరీస్ ఫోన్ల మాదిరిగానే,మోటోజెడ్3 కూడా పోగో- పిన్ రూపకల్పన, ఇది ఇప్పటికే ఉన్న అన్ని మోటో మోడ్ మోడళ్లకు  అనుకూలంగా ఉంటుంది. మేము ఇప్పటికే చెప్పిన విధంగా 5జి మోడ్ క్వాల్కమ్ యొక్క X50 మరియు X24 మోడెమ్ లను కలిగి ఉంటుంది. మోడ్ కూడా అదనంగా 2,000 mAh బ్యాటరీని కలిగివుంది, ఇది భవిష్యత్తులో 5G సిద్ధంగా ఉన్నప్పుడు జెడ్3 కి అవసరమవుతుంది. దీనిని సంప్రదాయంగా, మోటోరోలా రానున్న సంవత్సరం విడుదల చేస్తుంది. ఇది అన్ని జెడ్ సిరీస్ ఫోన్లకు అనుకూలంగా ఉంటుంది అన్నారు. మోటో మోడ్ 5జి యొక్క  ధర లేదా ఇతర లభ్యత వివరాలను ప్రకటించలేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo