Moto G31 ను ప్రకటించిన కొద్ధి రోజుల్లోనే మరొక స్మార్ట్ ఫోన్ ను విడుదల చెయ్యడానికి మోటోరోలా సిద్ధమవుతోంది. అయితే, ఈసారి మోటోరోలా 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చెయ్యబోతోంది. Moto G51 5G స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 10 న ఇండియాలో విడుదల చెయ్యడానికి డేట్ ప్రకటించింది మరియు Flipkart ప్రత్యేకంగా ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ 5G ప్రోసెసర్ తో వచ్చిన మొట్టమొదటి ఫోన్.
Survey
✅ Thank you for completing the survey!
Moto G51: స్పెక్స్
మోటో జి51 స్పెషిఫికేషన్స్ విషయానికి వస్తే, టీజింగ్ ద్వారా ఇప్పటికే చాలా ఫీచర్లను వెల్లడించింది. Moto G51 పెద్ద 6.8 ఇంచ్ FHD+ డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు జతగా 8GB RAMతో వస్తుంది. కెమెరాల పరంగా ఈ ఫోన్ వెనుక 50MP ట్రిపుల్ రియర్ మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరాలను కలిగివుంటుంది. ఈ ఫోన్ 20W ర్యాపిడ్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీతో వస్తుంది.
ఈ ఫోన్ ఇండిగో బ్లూ మరియు బ్రెట్ సిల్వర్ కలర్ అప్షన్ లలో లభిస్తుంది. నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ OS మరియు IP52 వాటర్ రెపెళ్ళంట్ డిజైన్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ఫోన్ రేపు లాంచ్ అవుతోంది.