మోటరోలా ఈరోజు తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Moto Edge 30 ను ఇండియాలో విడుదల చేసింది. Edge 30 Pro వచ్చిన కొన్ని నెలల తరువాత ఈ ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్ వేగవంతమయిన స్నాప్ డ్రాగన్ 778+ 5G మరియు pOLED వంటి ఆకర్షణీయమైన స్పెక్స్ తో తీసుకువచ్చింది. ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ఎటువంటి ఫీచర్లతో వచ్చిందో, దాని ధర ఎంత మరియు స్పెక్స్ పైన ఒక లుక్ వేద్దాం పదండి.
Motorola Edge 30 బేస్ వేరియంట్ ధర 6+128GB రూ.27,999 మరియు 8+128GB వేరియంట్ ధర రూ.29,999 గా ప్రకటించింది. అయితే, పరిచయ ఆఫర్‌లో భాగంగా, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి మీరు వాటిని వరుసగా రూ.25,999 మరియు రూ.27,999 కి పొందవచ్చు. మీరు Flipkart, Reliance Digital మరియు ఇతర ప్రధాన స్టోర్‌ల నుండి మే 12 మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.
మోటో ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ కేవలం 6.9mm మందంతో ప్రపంచంలో అత్యంత నాజూకైన 5G ఫోన్ గా పిలవబడుతుంది. ఈ ఫోన్ వేగవంతమైన క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 778G+ ప్రాసెసర్ తో పనిచేస్తుంది మరియు ఆండ్రాయిడ్ 12-ఆధారిత MyUX సాఫ్ట్‌వేర్‌ను పొందవచ్చు. ఇతర స్పెక్స్ విషయానికి వస్తే, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, USB-C 2.0 పోర్ట్, WiFi 6e మరియు బ్లూటూత్ 5.2 వంటివి ఉన్నాయి.
ఇక గేమర్స్ మరియు OTT కంటెంట్ ను మంచి డెప్త్ తో ఆస్వాదించడానికి వీలైన 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు 1 బిలియన్ కలర్ కవరేజీని కలిగిన pOLED డిస్ప్లే ఈ ఫోన్ లో వుంది. ఈ ఫోన్ 33W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4,020 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది, గరిష్టంగా 8GB RAM మరియు 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కూడా ఉంటుంది. స్క్రీన్ కి తగైనా సౌండ్ సిస్టం కూడా ఇందులో అందించింది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిం స్టీరియోస్పీకర్లతో వస్తుంది.
ఈ ఫోన్ వెనుక కెమెరా ప్యానెల్‌లో 50MP ప్రధాన సెన్సార్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు కెమెరా 32MP సెన్సార్ ఉండవచ్చు. మీరు ప్రైమరీ రియర్ కెమెరా నుండి 4K30 fps వీడియోలను షూట్ చేయవచ్చు.
Price: | ₹29999 |
Release Date: | 12 May 2022 |
Variant: | 128 GB/6 GB RAM , 128 GB/8 GB RAM |
Market Status: | Launched |