Motorola One Hyper వెనుక 64MP డ్యూయల్ కెమేరా 45W చార్జర్ తో విడుదలయ్యింది

Motorola One Hyper వెనుక 64MP డ్యూయల్ కెమేరా 45W చార్జర్ తో విడుదలయ్యింది
HIGHLIGHTS

ఆండ్రాయిడ్ 10 తో పనిచేస్తుంది.

బ్రెజిల్‌లో జరిగిన కార్యక్రమంలో మోటరోలా తన మోటరోలా వన్ హైపర్‌ ను ఆవిష్కరించింది. ఈ మోటరోలా వన్ హైపర్ పాప్-అప్ కెమెరా మాడ్యూల్ కలిగిన సంస్థ యొక్క మొట్టమొదటి స్మార్ట్‌ ఫోన్. అంతేకాక, ఇది 64MP ప్రాధమిక వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రస్తుతానికి, రియల్మి, షావోమి మరియు శామ్‌ సంగ్ నుండి మాత్రమే ఒక 64MP ప్రధాన కెమెరా స్మార్ట్‌ ఫోన్లను చూశాము. ఇక ఈ మోటరోలా ఫోనులో 32MP సెల్ఫీ షూటర్‌ ను కలిగి ఉన్నందున ఇది అత్యధిక రిజల్యూషన్ గల సెల్ఫీ కెమేరాను కలిగి ఉందని నిరూపిస్తుంది. ఇంకా, ఇది 45W ఫాస్ట్ ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది, ఇది స్మార్ట్‌ ఫోన్ను కేవలం 10 నిమిషాల్లో 0 నుండి 42 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది.

ఈ మోటరోలా వన్ హైపర్ ఒక 6.5-అంగుళాల 1080 x 2340 LCD స్క్రీన్ను అంగుళానికి 395 పిక్సెళ్లతో కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 19: 9 యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 చిప్‌ సెట్‌ తో పనిచేస్తుంది, ఇది 4 జిబి ర్యామ్ మరియు 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ తో జత చేయబడింది. ఇది స్టోరేజి పెంచుకోవడానికి మైక్రో SD కార్డ్ స్లాట్‌ ను కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్, బాక్స్ నుండి బయటి వస్తూనే, ఆండ్రాయిడ్ 10 తో పనిచేస్తుంది.

ఇక ఆప్టిక్స్ పరంగా, ముందు భాగంలో ఈ మోటరోలా వన్ హైపర్ 64MP ప్రాధమిక కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ను కలిగి ఉంది మరియు 118 డిగ్రీల ఫీల్డ్ వ్యూ తో 8MP వైడ్ యాంగిల్ లెన్స్‌ ను కలిగి ఉంది. ఇది 32MP క్వాడ్ పిక్సెల్ సెల్ఫీ షూటర్‌ తో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ కు మద్దతు ఇచ్చే 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ స్మార్ట్‌ ఫోన్ ప్యాక్ చేస్తుంది. అయితే, ఇది బాక్స్ లో మాత్రం కేవలం 18W ఛార్జర్‌ తో మాత్రమే వస్తుంది. ఇది వెనుక భాగంలో వేలిముద్ర సెన్సార్‌ ని కూడా కలిగివుంది.

మోటరోలా వన్ హైపర్ బ్లూ, రెడ్ మరియు పర్పుల్ కలర్ ఎంపికలలో వస్తుంది మరియు ఇది 200 గ్రాములు బరువు ఉంటుంది . ఈ స్మార్ట్‌ ఫోన్ ధరను  $ 400 (సుమారు రూ .28,000) గా నిర్ణయించింది. అయితే, ఇండియాలో ఈ ఫోన్ యొక్క లాంచ్ గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు. అందువల్ల, భారతదేశంలో మోటరోలా వన్ హైపర్ ధరను కూడా ప్రకటించలేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo