ఇటీవల లీకైన మోటోరోలా స్మార్ట్ ఫోన్ ఫోటోల ద్వారా 194MP భారీ కెమెరాతో మోటోరోలా స్మార్ట్ ఫోన్ తీసుకువస్తునట్లు కనిపిస్తోంది. మోటోరోలా ఫ్రాంటియర్ గా చెబుతున్న ఈ స్మార్ట్ ఫోన్ భారీ కెమెరా సెటప్ తో కనిపిస్తున్న హై రిజల్యూషన్ రెండర్స్ ఇప్పుడు వెలుగులోకివచ్చాయి. ఈ మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క పేరు 'ఫ్రాంటియర్' అని అధికారికంగా సూచించలేదని గుర్తుచేస్తున్నాను.
Survey
✅ Thank you for completing the survey!
మునుపటి లీక్ ఫ్రాంటియర్ స్మార్ట్‌ఫోన్ గురించి చాలా తక్కువగా సమాచారాన్ని వెల్లడించగా, లేటెస్ట్ నమూనా చిత్రాలు ఈ ఫోన్ మొత్తం డిజైన్ ను వెలుగులోకి తెచ్చాయి. ఈ లీక్స్ చూసిన తరువాత ఈ ఫోన్ డిజైన్ కూడా ప్రస్తుతం మార్కెట్లోని ఇతర ఫోన్ల మాదిరిగానే అనిపిస్తోంది. అంటే, మార్కెట్‌లోని ఇతర ప్రీమియం-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఎక్కువ భిన్నంగా లేదని అర్ధం చేసుకోవచ్చు.
లీకైన మోటోరోలా ఫ్రాంటియర్ లీక్డ్ రెండర్ల ప్రకారం, ఈ ఫోన్ యొక్క డిజైన్ పరంగా ముందు భాగంలో సాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే స్క్రీన్ పైభాగంలో ఒకే పంచ్ హోల్ కెమెరా ఉంటుంది. 6.7-అంగుళాల డిస్‌ప్లే వన్‌ప్లస్ 7 ప్రోలో కనిపించే మాదిరిగానే రెండు వైపులా వంగి ఉంటుంది.
కెమెరాల పరంగా ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద 194MP మైన్ సెన్సార్ మరియు రెండు అదనపు లెన్స్‌లను కలిగి ఉంటుంది. ఇందులో, ఒకటి 50MP Samsung అల్ట్రావైడ్ లెన్స్ కాగా మరొకటి 12-MP సోనీ IMX663 టెలిఫోటో లెన్స్. అంతేకాదు, మోటోరోలా ఫ్రాంటియర్ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 Gen 1 SoC యొక్క శక్తితో పనిచేస్తుందని కూడా లీకైన నివేదికలు చెబుతున్నాయి.