Motorola Edge 70 అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ఇప్పుడు ఆన్లైన్ లో బాగానే చర్చ జరుగుతోంది. మోటోరోలా యొక్క ప్రీమియం సిరీస్ అయిన ఎడ్జ్ సిరీస్ నుంచి రాబోతున్న ప్రీమియం ఫోన్ గా ఈ ఫోన్ చెప్పబడుతుంది. ఈ మోటోరోలా అప్ కమింగ్ ఫోన్ యొక్క డిజైన్ మరియు మరిన్ని ఫీచర్స్ వెల్లడించే లీక్స్ కొన్ని ఇప్పుడు ఆన్లైన్ లో దర్శనమిచ్చాయి. మరి మోటరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ఆన్లైన్ లో వెల్లడైన ఆ లీక్స్ ఏమిటో మరియు ఆ ఫీచర్స్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Motorola Edge 70 : లీక్స్ ఏమిటి?
మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్లో విడుదల కాబోతున్నట్లు ఆన్లైన్ లీక్స్ చెబుతున్నాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇప్పటివరకు మోటోరోలా లాంచ్ చేసిన అన్ని ఫోన్స్ కంటే స్లీక్ ఫోన్ గా లాంచ్ చేస్తుందని కొత్త లీక్స్ చెబుతున్నాయి. ఇందుకు తగిన రీజన్ కూడా వుంది. అదేమిటంటే, ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ కేవలం 4800 mAh బ్యాటరీ మరియు 68W ఫాస్ట్ ఛార్జ్ లాంచ్ చేసే ఆలోచనలో మోటోరోలా ఉన్నట్లు చెబుతున్నారు. ఇది గతంలో వచ్చిన మోటోరోలా ఎడ్జ్ 60 తో పోలిస్తే చాలా తక్కువ అవుతుంది. ఈ రీజన్ తో ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరేజ్ తో వచ్చే అవకాశం ఉందని కూడా కొత్త లీక్స్ చెబుతున్నాయి. మోటోరోలా అప్ కమింగ్ ఫోన్ లో 50MP OIS మెయిన్ కెమెరా ఉండవచ్చని మరియు ఇది 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి. మోటోరోలా అందించే అన్ని ఫాన్స్ మాదిరిగా ఈ ఫోన్ లో కూడా Dolby Atmos సౌండ్ సపోర్ట్ మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుందని మనం ఊహించవచ్చు.
ఓవరాల్ గా ఈ ఫోన్ పై వచ్చిన లీక్స్ ద్వారా ఈ ఫోన్ చాలా స్లీక్ అండ్ సాలిడ్ డిజైన్ తో స్టన్నింగ్ కెమెరా మరియు డిస్ప్లే కలిగి ఉండే ఫోన్ గా వస్తుందని మనం అంచనా వేయవచ్చు. అయితే, ఈ ఫోన్ స్పెక్స్ లేదా లాంచ్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి వివరాలు అందించలేదు కాబట్టి ఈ ఫోన్ గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.