అబ్బురపరుస్తున్న Motorola Edge 70 Neo కొత్త లీక్స్ : 200MP కెమెరా మరియు వైర్లెస్ ఛార్జ్ .. ఇంకా ఎన్నో.!

HIGHLIGHTS

అబ్బురపరుస్తున్న Motorola Edge 70 Neo కొత్త లీక్స్

ఈ ఫోన్ గురించి రోజు కొత్త లీక్స్ కూడా ఆన్లైన్ లో దర్శనం ఇస్తున్నాయి

ఈ ఫోన్ లో 200MP మెయిన్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉండే అవకాశం ఉంది

Motorola Edge 70 Neo గురించి మోటరోలా ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. అయితే, మోటోరోలా ఎడ్జ్ 70 నియో స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే లాంచ్ చేసే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి. కేవలం లాంచ్ గురించి అంచనా వేయడమే కాదు ఈ ఫోన్ ఫీచర్స్ గురించి కూడా లీక్స్ రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోన్ గురించి కొత్తగా వచ్చిన లీక్స్ మొబైల్ ప్రియులను అబ్బురపరిచేలా ఉన్నాయి.

Motorola Edge 70 Neo

మోటోరోలా ఎడ్జ్ 70 సిరీస్ నుంచి ఇప్పటికే ఎడ్జ్ 70, ఎడ్జ్ 70 ప్రో మరియు ఎడ్జ్ 70 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. ఇప్పుడు ఈ సిరీస్ ను ఎడ్జ్ 70 నియో ఫోన్ తో మరింత విస్తరించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఊహాగానాలను నిజం చేసేలా ఈ ఫోన్ గురించి రోజు కొత్త లీక్స్ కూడా ఆన్‌లైన్ లో దర్శనం ఇస్తున్నాయి. ఆఫ్ కోర్స్ కంపెనీ నుంచి ఇంకా అఫీషియల్ స్టేట్‌మెంట్ లేదా లాంచ్ డీటెయిల్స్ ఇంకా రాలేదు. కానీ ఈ ఫోన్ గురించి ఆన్లైన్ లో దర్శనమిచ్చిన లీక్స్ మోటోరోలా ఫ్యాన్స్ ను మొబైల్ ప్రియులను అబ్బురపరుస్తున్నాయి.

Also Read : 5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ డీల్ తో ఆల్ మోస్ట్ నార్మల్ సౌండ్ బార్ ధరకే లభిస్తోంది.!

Motorola Edge 70 Neo : లీక్డ్ ఫీచర్స్

మోటోరోలా ఎడ్జ్ 70 నియో స్మార్ట్ ఫోన్ చాలా ఫీచర్స్ ఆన్లైన్ లీక్స్ వెల్లడించాయి. ఈ లీక్స్ ప్రకారం, ఎడ్జ్ 70 నియో ఫోన్ ఫ్లాట్ డిజైన్ అండ్ ప్రీమియం డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1.5K రిజల్యూషన్ కలిగిన 6.4-అంగుళాల pOLED డిస్‌ప్లే ఉడొంచని కూడా లీక్స్ చెబుతున్నాయి.

మోటోరోలా ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7450 చిప్ సెట్ తో లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని కూడా లీక్స్ వస్తున్నాయి. అయితే, ఈ ఫోన్ క్వాల్కమ్ కొత్త చిప్ సెట్ తో వచ్చే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్ కెమెరా గురించి కొత్త లీక్ హింట్ ఇచ్చింది. ఈ ఫోన్ లో 200MP మెయిన్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉండే అవకాశం ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టం తో రావొచ్చని కూడా కొత్త లీక్స్ పేర్కొన్నాయి. ఇందులో LPDDR5X ర్యామ్ మరియు UFS 3.1 ఫాస్ట్ రెస్పాన్స్ స్టోరేజ్ అవకాశం గురించి కూడా చెబుతున్నారు. ఇందులో 60W ఫాస్ట్ ఛార్జ్, వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ మరియు 6,000 mAh బిగ్ బ్యాటరీ గురించి కూడా లీక్స్ హింట్ ఇస్తున్నాయి.

అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ లేదా గ్లోబల్ లాంచ్ అవుతోందనే కన్ఫర్మేషన్ కానీ, ఈ ఫోన్ లాంచ్ డేట్ లేదా ఫీచర్స్ గురించి కానీ కంపెనీ నుంచి ఎటువంటి స్టేట్మెంట్ లేదని గమనించాలి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :