Motorola Edge 70 Max: పవర్ ఫుల్ ప్రీమియం మిడ్ రేంజ్ ఫోన్ గా లాంచ్ అయ్యింది.. ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

HIGHLIGHTS

Motorola Edge 70 Max ను అధికారికంగా విడుదల చేసింది

ఈ ఫోన్ ను హై ఎండ్ యూజర్‌లను లక్ష్యంగా చేసుకొని లాంచ్ చేసింది

ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ మరియు గొప్ప అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది

Motorola Edge 70 Max: మోటోరోలా భారత మార్కెట్లో తన కొత్త ప్రీమియం మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఎడ్జ్ 70 మ్యాక్స్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ ను శక్తివంతమైన క్వాల్కమ్ Snapdragon 8 Gen 5 ప్రాసెసర్, 7100 mAh భారీ బ్యాటరీ మరియు 144Hz QHD+ LTPO AMOLED డిస్‌ప్లే వంటి ప్రీమియం ఫీచర్స్ తో ఈ ఫోన్ ను హై ఎండ్ యూజర్లను లక్ష్యంగా చేసుకొని లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Motorola Edge 70 Max : ప్రైస్

మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ తో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పాంటోన్ డార్క్ షాడో, పాంటోన్ ఆక్వా గ్రే మరియు పాంటోన్ ఐస్ మెల్ట్ మూడు రంగుల్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ప్రైస్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.

  • మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ (8GB + 128GB) ప్రైస్ : రూ. 54,999
  • మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ (12GB + 256GB) ప్రైస్ : రూ. 59,999

ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్లు కూడా మోటోరోలా అందించింది. ఈ ఫోన్ జూలై 20వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ మరియు మోటోరోలా అధికారిక సైట్ ను సేల్ చేస్తుంది.

ఆఫర్స్

ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ మరియు గొప్ప అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై Axis మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ తో రూ. 5,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అలాగే, ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ లో ఏదైనా ఒక ఆఫర్ మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ రూ. 49,999 స్టార్టింగ్ ప్రైస్ లో లభిస్తుంది.

Also Read: Realme C100x: బడ్జెట్ సిరీస్ నుంచి 8000 mAh బిగ్ బ్యాటరీ ఫోన్ లాంచ్ చేస్తున్న రియల్‌మీ.!

Motorola Edge 70 Max: ఫీచర్స్

మోటోరోలా ఈ ఫోన్ ను 6.82 అంగుళాల QHD+ LTPO AMOLED తో లాంచ్ చేసింది. ఈ స్క్రీన్ 7000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HDR10+ సపోర్ట్, 144Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7i రక్షణ మరియు 95.12% స్క్రీన్ టు బాడీ రేషియో వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120 FPS BGMI కి సపోర్ట్ చేస్తుంది మరియు దానికి తగిన చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 12GB LPDDR5X ర్యామ్ మరియు UFS 4.1 256GB హెవీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Hello UI సాఫ్ట్ వేర్ తో Android 16 OS పై నడుస్తుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP Sony LYT OIS ప్రధాన కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే, ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 30FPS / 60FPS తో 4K HDR 10+ వీడియో సపోర్ట్, Ai కెమెరా ఫీచర్స్ మరియు మోటోరోలా యొక్క ప్రత్యేకమైన కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ ను 7100mAh భారీ బ్యాటరీతో మోటోరోలా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను ప్రీమియం ఛార్జ్ సెటప్ అండ్ స[సపోర్ట్ తో మోటోరోలా లాంచ్ చేసింది. ఈ ఫోన్ 25W మాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ మరియు 90W టర్బో వైడ్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్, Dolby Atmos, మెటల్ ఫ్రేమ్ మరియు గ్లాస్ డిజైన్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :