Motorola Edge 70 Max launch date and key specs confirmed
Motorola Edge 70 Max: మోటోరోలా ఎడ్జ్ సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎడ్జ్ 70 మ్యాక్స్ లాంచ్ వివరాలు మోటోరోలా రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కీలక ఫీచర్స్ సైతం టీజర్ పేజీ ద్వారా రివీల్ చేసింది. ఈ ఫోన్ అల్ట్రా ప్రీమియం ఫీచర్స్ లాంచ్ అవుతోందని ఈ ఫోన్ ఫీచర్స్ చూస్తుంటే అర్ధం అవుతుంది.
మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ జూలై 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ పేరుకు తగ్గట్టు ప్రతి విభాగంలో మ్యాక్స్ సెటప్ కలిగి ఉంటుందని మోటోరోలా చెబుతోంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుండి ఈ ఫోన్ కీలక వివరాలు కూడా అందించింది.
మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ ఫోన్ గొప్ప గేమింగ్ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ లో 120 FPS BGMI గేమింగ్ సపోర్ట్ చేసే గొప్ప డిస్ప్లే మరియు చిప్ సెట్ ఉంటాయి. డీటెయిల్స్ లోకి వెళితే, ఈ అప్ కమింగ్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 7000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన LTPO బిగ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ QHD+ రిజల్యూషన్, 144 Hz రిఫ్రెష్ రేట్, 95.12% స్క్రీన్ టు బాడీ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఇక ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 5 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. దీనికి జతగా 12GB LPDDR5X భారీ ర్యామ్ మరియు ఆన్ డివైజ్ AI ప్రాసెసింగ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన చిప్ సెట్ మరియు ర్యామ్ సపోర్ట్ తో ఏకంగా 30 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందిస్తుందని మోటోరోలా తెలిపింది.
Also Read: Tecno Camon 50 Ultra: సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!
ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే కూలింగ్ సెటప్ కూడా ఈ ఫోన్ లో ఉంది. అదేమిటంటే, ఈ ఫోన్ లో 5500mm వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంటుంది మరియు ఇది ఫోన్ ను వేగంగా చల్లబరుస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం బ్యాటరీ అండ్ ఛార్జింగ్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7100 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇందులో 25W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ మరియు 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.