Tecno Camon 50 Ultra: సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!
టెక్నో Camon సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ రోజు అనౌన్స్ చేసింది
Tecno Camon 50 Ultra స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేయడానికి టెక్నో సన్నద్ధం
టెక్నో క్యామ్ఆన్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్ సరికొత్త సిల్క్ ఫ్లో డిజైన్ తో కనిపిస్తోంది
Tecno Camon 50 Ultra: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ టెక్నో కెమెరా ప్రత్యేకమైన సిరీస్ Camon సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ రోజు అనౌన్స్ చేసింది. అదే, టెక్నో క్యామ్ఆన్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఈ ఫోన్ వివరాలు వెల్లడించే టీజర్ ఇమేజ్ కూడా రిలీజ్ చేసింది. ఈ అప్ కమింగ్ టెక్నో స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేయడానికి టెక్నో చూస్తున్నట్లు ఈ టీజర్ ఇమేజ్ చూస్తే అర్ధం అవుతుంది.
SurveyTecno Camon 50 Ultra : లాంచ్ డేట్
టెక్నో క్యామ్ఆన్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్ జులై 17 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ద్వారా టీజింగ్ చేయబడుతోంది మరియు ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ ద్వారా సేల్ అవుతుంది.
Tecno Camon 50 Ultra : ఫీచర్స్
టెక్నో క్యామ్ఆన్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్ సరికొత్త సిల్క్ ఫ్లో డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ కర్వుడ్ డిజైన్ తో వస్తుంది మరియు కర్వుడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ వివరాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇదే కాదు ఈ ఫోన్ లో నెబ్యులా టైటానియం, సైప్రస్ గ్రీన్ మరియు మిస్టి పర్పల్ మూడు రంగుల్లో లాంచ్ చేస్తున్నట్లు కూడా టెక్నో కన్ఫర్మ్ చేసింది.

ఈ ఫోన్ కెమెరా సెటప్ కూడా ఈ ఇమేజ్ ద్వారా వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరాతో లాంచ్ అవుతుంది. ఈ కెమెరా కలిగిన సెన్సార్ వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ Dolby Atmos సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: New Smartphone లో ఉండే ఈ టాప్ AI ఫీచర్లు మీ పనులు మరింత సులభం చేస్తాయి.!
టెక్నో క్యామ్ఆన్ 50 అల్ట్రా : లీక్డ్ ఫీచర్స్
ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలు ఆన్లైన్లో లీక్ అయినట్లు చెబుతున్నారు. ఈ లీక్డ్ అండ్ రూమర్డ్ ఫీచర్స్ ద్వారా ఈ ఫోన్ పై ఒక అవగాహన వస్తోంది. లీక్స్ ప్రకారం, ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, అధిక బ్రైట్‌నెస్ సపోర్ట్ తో పాటు ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 8350 లేదా దానికి సమానమైన పెర్ఫార్మెన్స్ అందించే 5G ప్రాసెసర్ జతగా 12GB వరకు RAM మరియు 256GB స్టోరేజ్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ లో 50MP ప్రధాన కెమెరాతో పాటు అల్ట్రా వైడ్ లెన్స్ మరియు టెలిఫోటో లేదా పెరిస్కోప్ కెమెరా వంటి అధునాతన సెన్సార్ ఉండే అవకాశం ఉందని లీకులు సూచిస్తున్నాయి. మరి ఈ ఫోన్ లీక్డ్ ఫీచర్స్ లో ఎన్ని నిజం అవుతాయో చూడాలి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
