Motorola Edge 70 Max: అల్ట్రా ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!
Motorola Edge 70 Max లాంచ్ వివరాలు మోటోరోలా రివీల్ చేసింది
లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కీలక ఫీచర్స్ సైతం టీజర్ పేజీ ద్వారా రివీల్ చేసింది
ఈ ఫోన్ అల్ట్రా ప్రీమియం ఫీచర్స్ లాంచ్ అవుతుంది
Motorola Edge 70 Max: మోటోరోలా ఎడ్జ్ సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎడ్జ్ 70 మ్యాక్స్ లాంచ్ వివరాలు మోటోరోలా రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కీలక ఫీచర్స్ సైతం టీజర్ పేజీ ద్వారా రివీల్ చేసింది. ఈ ఫోన్ అల్ట్రా ప్రీమియం ఫీచర్స్ లాంచ్ అవుతోందని ఈ ఫోన్ ఫీచర్స్ చూస్తుంటే అర్ధం అవుతుంది.
SurveyMotorola Edge 70 Max: కన్ఫర్మ్ లాంచ్ డేట్
మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ జూలై 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ పేరుకు తగ్గట్టు ప్రతి విభాగంలో మ్యాక్స్ సెటప్ కలిగి ఉంటుందని మోటోరోలా చెబుతోంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుండి ఈ ఫోన్ కీలక వివరాలు కూడా అందించింది.
Motorola Edge 70 Max: ఫీచర్స్
మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ ఫోన్ గొప్ప గేమింగ్ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ లో 120 FPS BGMI గేమింగ్ సపోర్ట్ చేసే గొప్ప డిస్ప్లే మరియు చిప్ సెట్ ఉంటాయి. డీటెయిల్స్ లోకి వెళితే, ఈ అప్ కమింగ్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 7000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన LTPO బిగ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ QHD+ రిజల్యూషన్, 144 Hz రిఫ్రెష్ రేట్, 95.12% స్క్రీన్ టు బాడీ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది.

ఇక ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 5 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. దీనికి జతగా 12GB LPDDR5X భారీ ర్యామ్ మరియు ఆన్ డివైజ్ AI ప్రాసెసింగ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన చిప్ సెట్ మరియు ర్యామ్ సపోర్ట్ తో ఏకంగా 30 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందిస్తుందని మోటోరోలా తెలిపింది.
Also Read: Tecno Camon 50 Ultra: సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!
ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే కూలింగ్ సెటప్ కూడా ఈ ఫోన్ లో ఉంది. అదేమిటంటే, ఈ ఫోన్ లో 5500mm వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంటుంది మరియు ఇది ఫోన్ ను వేగంగా చల్లబరుస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం బ్యాటరీ అండ్ ఛార్జింగ్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7100 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇందులో 25W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ మరియు 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
