భారీ ఆఫర్లతో Motorola Edge 50 Pro 5G ఫస్ట్ సేల్ .!
Motorola Edge 50 Pro 5G స్మార్ట్ ఫోన్ సేల్ రేపు జరగనున్నది
ఈ కొత్త ఫోన్ ను మంచి ఆఫర్లతో మోటోరోలా సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తోంది
ఈ ఫోన్ Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది
మోటోరోలా ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన Motorola Edge 50 Pro 5G స్మార్ట్ ఫోన్ సేల్ రేపు జరగనున్నది. ఈ కొత్త ఫోన్ ను మంచి ఆఫర్లతో మోటోరోలా సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తోంది. 30 వేల బడ్జెట్ లో భారీ ఫీచర్స్ తో ఈ ఫోన్ ను మోటోరోలా విడుదల చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ నుండి లభించనున్న ఆఫర్లు మరియు ఫోన్ స్పెక్స్ పైన ఒక లుక్కేయండి.
SurveyMotorola Edge 50 Pro 5G: Price
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 31,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో విడుదల చెయ్యబడింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ రూ. 35,999 రూపాయల ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఆఫర్స్
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో అందించింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ EMI తో ఈ మోటోరోలా కొత్త ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,500 రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలవుతుంది.
Also Read: RBI New UPI Rules: యుపిఐ యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపిన రిజర్వ్ బ్యాంక్.!
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5జి: ప్రత్యేకతలు
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను గొప్ప డిస్ప్లే, కెమేరా మరియు డిజైన్ వంటి మరిన్ని ఫీచర్స్ తో మోటోరోలా విడుదల చేసింది. ఈ ఫోన్ లో 6.7 ఇంచ్ 10-బిట్ ప్యాంటోన్ వాలిడేటెడ్ ట్రూ కలర్ డిస్ప్లేని 1.5 K రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ తో చేస్తుంది మరియు 8GB /12GB RAM మరియు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ లతో వస్తుంది.

ఈ ఫోన్ లో 50MP + 13MP + 10MP ట్రిపుల్ రియర్ మరియు 50MP సెల్ఫీ కెమేరా వుంది. ఈ ఫోన్ మెయిన్ కెమేరాతో 4K UHD HDR10+ వీడియోలను మరియు 4K UHD మ్యాక్రో వీడియోలను షూట్ చేయవచ్చని కూడా మోటోరోలా తెలిపింది. ఈ ఫోన్ లో 125W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ మరియు 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4500 mAh బ్యాటరీ వుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile