మోటో వన్ విజన్ ఒక 48MP కెమేరా మరియు పంచ్ హోల్ సెల్ఫీ కెమరాతో వచ్చింది

Updated on 16-May-2019

మోటరోలా యొక్క తాజా స్మార్ట్ ఫోన్ అయినటువంటి,  మోటో వన్ విజన్ లాంచ్ అయ్యింది. ఈ కంపెనీ ఈ ఫోన్ను ముందుగా బ్రెజిల్లో ప్రారంభించింది.  మోటోరోలా 299 యూరోలకు (23,500 రూపాయల) ధరతో  దీనిని ప్రారంభించింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడినట్లయితే, ఇది పంచ్ హోల్ డిస్ప్లే సెల్ఫీ  కెమెరా వంటి  ప్రత్యేక లక్షణంతో వస్తుంది.

Moto One Vision ప్రత్యేకతలు

ఇక స్పెక్స్ గురించి మాట్లాడినట్లయితే, ఈ స్మార్ట్ ఫోన్ 6.3-అంగుళాల LCD ప్యానెల్ మరియు HD + రిజల్యూషన్తో వస్తుంది.  ఒక  Exynos 9609 చిప్సెట్టుతో ఇది పనిచేస్తుంది. అయితే కేవలం 4GB RAM మరియు 128GB స్టోరేజి కలిగిన ఒకే ఒక్క వేరియంటుతో మాత్రమే  ఈ ఫోన్ను విడుదల చేసింది. అదనంగా, ఈ ఫోన్ మంచి  డైజైన్ తో ప్రవేశపెట్టబడింది. ఇందులో మీరు 21: 9 ఆస్పెక్ట్ రేషియోని పొందుతారు. అలాగే,  ఈ మోటో వన్ విజన్ యొక్క కెమెరా విభాగం గురించి మాట్లాడినట్లయితే, ఇందులో డ్యూయల్  కెమెరా సెటప్ ఇచ్చారు. 

ఇందులో ఒక  48 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరా సెన్సార్ ఉంది, ఇది f / 1.7 ఎపర్చరు కలిగిన ఒక 48MP కెమెరాతో వస్తుంది. మోటోరోలా నుండి ఒక 48MP కెమేరాతో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా ఇది నిలుస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా,  ఒక 5 MP సెకండ్ కెమేరాని డెప్త్ సెన్సింగ్ కోసం అందించారు. ఇది OIS కు మద్దతు ఇస్తుంది మరియు ఇందులో నైట్ టైం లో మంచి ఫోటోలను తీసుకునేలా,  నైట్ వ్యూ మోడ్నికూడా  అందుకుంటారు. ఈ స్మార్ట్ ఫోనులో, సెల్ఫీల కోసం 25-మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వబడింది. ఈ స్మార్ట్ ఫోన్  ఆండ్రాయిడ్ 9 పై OS, స్టాక్ ఎక్స్పీరియన్సుతో వస్తుంది. ఇది ఒక 15W టర్బోపవర్ ఛార్జింగ్ మద్దత్తు కలిగిన 3,500mAh బ్యాటరీతో వస్తుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :