48MP ట్రిపుల్ కెమేరా 25MP సెల్ఫీ కెమేరా కలిగిన MOTO G8 Plus పైన భారీ ఆఫర్లు

48MP ట్రిపుల్ కెమేరా 25MP సెల్ఫీ కెమేరా కలిగిన MOTO G8 Plus పైన భారీ ఆఫర్లు
HIGHLIGHTS

మెరుగైన కెమెరాలు మరియు మరెన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది.

మోటో జి 8 ప్లస్,  స్మార్ట్ ఫోన్ ఇటీవల కాలంలో ఇండియాలో ప్రారంభించబడింది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ను మోటో జి 7 ప్లస్ యొక్క తరువాతి తరం ఫోనుగా వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్, మెరుగైన కెమెరాలు మరియు మరెన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ మోటో జి 8 ప్లస్ ఆండ్రాయిడ్ 9 పై OS పైన నడుస్తుంది. అయితే, త్వరలో ఆండ్రాయిడ్ 10 అప్‌ డేట్‌ ను కూడా విడుదల చేస్తామని మోటరోలా హామీ కూడా ఇచ్చింది. కొత్తగా ప్రారంభించిన ఈ మోటో ఫోన్ పైన  మంచి ఆఫర్లను ప్రకటించింది.  

మోటో జి 8 ప్లస్ ధర మరియు ఆఫర్లు

MOTO G8 Plus  ఫోన్, కాస్మిక్ బ్లూ మరియు  క్రిస్టల్ పింక్ వంటి రెండు రంగుల ఎంపికలతో వస్తుంది మరియు ఫ్లిప్‌కార్ట్ అమ్ముడవుతోంది. భారతదేశంలో ఈ మోటో జి 8 ప్లస్ ధర 13,999 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే, లేటెస్ట్ ఆఫర్ల విషయానికొస్తే, ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 10% డిస్కౌంట్ దొరుకుతుంది. అంటే, 13,999 రూపాయల విలువగల  ఈ ఫోన్ పైన గరిష్టంగా 1399 రుపాయల్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే, యాక్సిస్ బ్యాంక్ బజ్  మరియు flipkart యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనేవారికి 5% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అధనంగా, NO Cost EMI, ఎక్స్చేంజి ఆఫర్ల క్రింద మీ ఫోనుతో  గరిష్టంగా 10,800 రూపాయల వరకూ తగ్గిపు లభిస్తుంది.                

మోటో G 8 ప్లస్ ప్రత్యేకతలు

మోటో జి 8 ప్లస్ ఒక 6.3-అంగుళాల FHD + ఐపిఎస్ LCD డిస్ప్లే ను కలిగి ఉంది, ఇది 2280 x 1080 పిక్సెళ్ల రిజల్యూషన్ అందిస్తుంది మరియు 19: 9 యాస్పెక్ట్  రేషియోని కలిగి ఉంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 ఆక్టా కోర్ ప్రాసెసరుతో పనిచేస్తుంది, ఇది అడ్రినో 610 GPU తో జత చేయబడింది. ఈ స్మార్ట్‌ ఫోన్ 4 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇంకా,  ఒక డేడికేటెడ్ మైక్రో SD కార్డ్  ద్వారా 512GB వరకు స్టోరేజిని పెంచుకోవచ్చు.ఈ స్మార్ట్ ఫోన్ ఒక 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 4000 mAh బ్యాటరీతో పాటుగా వస్తుంది .

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ మోటో జి 8 ప్లస్ వెనుక భాగంలో ఒక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది మరియు ఇందులో : 48 MP ప్రధాన సెన్సార్ (f/ 2.0, క్వాడ్ పిక్సెల్) + 5 MP డెప్త్ సెన్సార్ (f / 2.2) + 16 MP యాక్షన్ కెమేరా (f / 2.2 , క్వాడ్ పిక్సెల్, 2.0um, FOV 117 °  డేడికేటెడ్ అల్ట్రా-వైడ్ కెమెరా) టీతో ఉంటుంది. సెల్ఫీల కోసం, ముందు భాగంలో 25 MP(f / 2.0) సెల్ఫీ కెమేరా ఉంది. వెనుక కెమెరాలో బర్స్ట్ షాట్, ఆటో హెచ్‌డిఆర్, టైమర్, హై రెస్ జూమ్, నైట్ విజన్, షాట్ ఆప్టిమైజేషన్, లైవ్ ఫిల్టర్, పోర్ట్రెయిట్ లైటింగ్, స్మార్ట్ కంపోజిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.  వీటితో పాటుగా, ఆటో స్మైల్ క్యాప్చర్, సినిమాగ్రాఫ్, కటౌట్ మరియు మరిన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి.

మోటో జి 8 ఎఫ్ఎమ్ రేడియో, బ్లూటూత్ 5.0, NFC  మరియు మరిన్నింటికి మద్దతు ఇస్తుంది. ఇక సెన్సార్ల విషయానికొస్తే, ఇది ఫింగర్ ప్రింట్ రీడర్, ప్రాక్సిమిటీ, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, సెన్సార్ హబ్, గైరోస్కోప్, అల్ట్రాసోనిక్, e-కంపాస్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo