Moto G77 Power ఫోన్ భారీ లాంచ్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

Moto G77 Power స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది

ఈ ఫోన్ భారీ లాంచ్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది

మోటోరోలా ఈ లేటెస్ట్ ఫోన్ పై బిగ్ డీల్స్ అందించింది

Moto G77 Power ఫోన్ భారీ లాంచ్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!

Moto G77 Power స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది. గత నెల రెండు వారాలుగా మోటోరోలా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ చేసింది. అయితే, ఎట్టకేలకు ఈ ఫోన్ ను ఈరోజు మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ను ఆకట్టుకునే ఫీచర్స్ తో అందించింది. ఈ ఫోన్ ఫోన్ భారీ లాంచ్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto G77 Power : ప్రైస్

మోటోరోలా ఈ లేటెస్ట్ ఫోన్ ను రూ. 25,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పాంటోన్ ఫ్యూసియా రెడ్, పాంటోన్ ఇంపెనెట్రెబుల్ మరియు పాంటోన్నాటికల్ బ్లూ మూడు రంగుల్లో లభిస్తుంది. జూలై 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభం అవుతుంది.

ఆఫర్స్

మోటోరోలా ఈ లేటెస్ట్ ఫోన్ పై బిగ్ డీల్స్ అందించింది. ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల భారీ అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అయితే, ఈ రెండు ఆఫర్స్ ఏదైనా ఒకటి మాత్రమే లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 23,999 ధరలో లభిస్తుంది.

Also Read: Jio Tv Pro: రూ. 55 రూపాయకే 1000 లైవ్ ఛానల్స్ తో కొత్త ప్లాన్ ప్రకటించిన జియో.!

Moto G77 Power : ఫీచర్స్

ఈ స్మార్ట్ ఫోన్ 6.72 ఇంచ్ LCD డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గరిష్టంగా 1,050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటమే కాకుండా గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ 6nm ఫ్యాబ్రికేషన్ టెక్ తో వచ్చిన మీడియాటెక్ Dimensity 6400 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 8GB LPDDR4X RAM మరియు 128GB UFS 2.2 స్టోరేజ్ ఉన్నాయి.

మోటో జి 77 ఫోన్ Android 16 ఆధారిత Hello UI పై నడుస్తుంది. ఈ ఫోన్ 1 ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌ డేట్ తో పాటు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌ డేట్స్ కూడా అందిస్తామని ప్రకటించింది. ఈ ఫోన్ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ మరియు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP Sony LYT-600 ప్రధాన సెన్సార్ తో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ భారీ 7,000mAh బ్యాటరీతో మార్కెట్లోకి వచ్చింది మరియు 30W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

ఇక ఈ ఫోన్ ఇతర ఫీచర్స్ చూస్తే, ఇది ఆడియో కోసం స్టీరియో స్పీకర్లు, Dolby Atmos మరియు Hi-Res Audio సపోర్ట్ కలిగి ఉంటుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.4, USB Type-C, GPS వంటి ఫీచర్లు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile