Moto G67 Power 5G: భారీ బ్యాటరీ మరియు Sony ట్రిపుల్ కెమెరాతో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

మోటోరోలా అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ ఈరోజు వెల్లడించింది

మోటో జి67 పవర్ ప్రీమియం వేగన్ లెథర్ తో మూడు సరికొత్త రంగుల్లో లాంచ్ అవుతుంది

ఈ ఫోన్ 24 జీబీ వరకు ర్యామ్ బూస్ట్ సపోర్ట్ కలిగి ఉంటుంది

Moto G67 Power 5G: భారీ బ్యాటరీ మరియు Sony ట్రిపుల్ కెమెరాతో లాంచ్ అవుతోంది.!

Moto G67 Power 5G: మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఈ ఫోన్ కీలక ఫీచర్స్ సైతం ఈరోజు వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి రెండు రోజుల క్రితం టీజింగ్ మొదలుపెట్టిన మోటోరోలా ఈరోజు ఈ ఫోన్ డిజైన్ మరియు కీలక ఫీచర్స్ తో కంప్లీట్ టీజర్ ని అందించింది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ లో భారీ బ్యాటరీ మరియు Sony ట్రిపుల్ కెమెరాతో లాంచ్ అవుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto G67 Power 5G: ఇండియా లాంచ్ డేట్?

మోటో జి67 పవర్ స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించింది టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ మైక్రో సైట్ పేజీ నుండి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ వెల్లడించింది.

Moto G67 Power 5G: కీలక ఫీచర్స్

మోటో జి67 పవర్ స్మార్ ఫోన్ ప్రీమియం వేగన్ లెథర్ తో మూడు సరికొత్త రంగుల్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ FHD+ రిజల్యూషన్ కలిగిన 6.7 ఇంచ్ స్క్రీన్ తో లంచ్ అవుతుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది మరియు గొరిల్లా గ్లాస్ 7రక్షణతో ఉంటుంది. ఈ ఫోన్ MIL – 810H మిలటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ తో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 2 ప్రోసెసర్ జతగా 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ 24 జీబీ వరకు ర్యామ్ బూస్ట్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Moto G67 Power 5G Features

కెమెరా పరంగా, ఈ మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 50MP Sony LYTIA 600 మెయిన్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది మరియు ముందు 32MMP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన సెల్ఫీ మరియు రియర్ కెమెరా కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ సెగ్మెంట్ లీడ్ 7000 mAh బిగ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది.

Also Read: 17 వేల ఆఫర్ ధరకే బ్రాండెడ్ 43 ఇంచ్ 4K QLED స్మార్ట్ టీవీ అందుకోండి.!

ఈ మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ IP64 రేటింగ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ వస్తుంది. ఇందులో డాల్బీ అట్మాస్ మరియు Hi-Res సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉంటాయి. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile