Moto G64 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మరింత చవక ధరకు లభిస్తుంది. మంచి ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో వచ్చిన ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మరింత చవక ధరకు లభిస్తోంది. గొప్ప డిజైన్, ఫాస్ట్ ప్రోసెసర్, పెద్ద బ్యాటరీ మరియు ఆకట్టుకునే మరిన్ని ఇతర ఫీచర్స్ తో వచ్చిన ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ప్రస్తుత ధర, ఆఫర్స్ మరియు ఫీచర్లు తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Moto G64 5G: ఆఫర్స్
మోటో జి64 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 14,999 రూపాయల ధరకు లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ. 1,000 డిస్కౌంట్ తో రూ. 13,999 ధరకే లభిస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,400 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 12,599 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది.
మోటో జి64 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7025 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ చి సెట్ కి జతగా 8GB ఫిజికల్ ర్యామ్, 8GB ర్యామ్ బూస్ట్ సపోర్ట్ మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.5 ఇంచ్ LCD స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి వుంటుంది.
ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 50MP (OIS) + 8MP క్వాడ్ పిక్సెల్ కెమెరా ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 16MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ తో FHD వీడియోలు మరియు మంచి బ్రైట్ ఫోటోలు షూట్ సహజ అవకాశం వుంది. ఈ మోటరోలా స్మార్ట్ ఫోన్ 6000 mAh హెవీ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.