Moto G22: మోటరోలా లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్.. ఎప్పుడంటే..!!
Moto G22 మొదటిసారిగా అమ్మకానికి రాబోతోంది
Flipkart ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది
50MP క్వాడ్ రియర్ కెమెరా మరియు బిగ్ బ్యాటరీ
మోటరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Moto G22 మొదటిసారిగా అమ్మకానికి రాబోతోంది. ఇండియాలో సరికొత్తగా వచ్చిన ఈ మోటో లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 13 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి Flipkart ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్ నుండి ICICI బ్యాంక్ యొక్క 10% డిస్కౌంట్ అఫర్ కూడా అఫర్ చేస్తోంది. ఈ ఫోన్ ప్రత్యేకతల పరంగా, ఎటువంటి యాడ్స్ లేకుండా క్లీన్ OS నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 12 తో వచ్చింది. అంతేకాదు, 50MP క్వాడ్ రియర్ కెమెరా మరియు బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్లను కలిగివుంటుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు మరియు ఆఫర్లతో సహా పూర్తి సమాచారాన్ని క్రింద చూడవచ్చు.
SurveyMoto G22: ధర
మోటో జి22 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ.10,999 ధరతో వచ్చింది. ఈ ఫోన్ కాస్మిక్ బ్లాక్ మరియు ఐస్ బర్గ్ బ్లూ కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ ఏప్రిల్ 13 నుండి Flipkart ద్వారా అమ్మకాలను కొనసాగిస్తుంది. ఈ ఫోన్ పైన 10% ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు అఫర్ ను కూడా అందించింది.
Moto G22: స్పెక్స్
మోటో జి22 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల HD+ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే మధ్యలో పంచ్ హోల్ డిజైన్ ను కలిగివుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G37 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే, మోటో జి22 Android 12 ఆధారంగా Motorola యొక్క My UX సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. డేడికేటెడ్ మైక్రో SD కార్డ్ తో 256GB వరకూ మెమొరీని విస్తరించవచ్చు.
ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందుభాగంలో వున్నా సెంటర్ పంచ్ హోల్ కటౌట్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 20W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ నానో-సిమ్, USB-C సాకెట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 తో ఉంటుంది.