మోటో జి పవర్ (2022) లాంచ్..ఫీచర్లు ఎలాఉన్నాయంటే..!

HIGHLIGHTS

Moto G Power(2022) స్మార్ట్ ఫోన్ విడుదల

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్

మోటో జి పవర్ (2022) లాంచ్..ఫీచర్లు ఎలాఉన్నాయంటే..!

మోటోరోలా లేటెస్ట్ గా తన బడ్జెట్ సిరీస్ నుండి Moto G Power(2022) స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది.  వాస్తవానికి, ఈ ఫోన్ 2021 ప్రారంభంలో ఆవిష్కరించిన Moto G Power యొక్క నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా 2022 ఎడిషన్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. మోటో జి పవర్ (2022) స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు పెద్ద బ్యాటరీ వంటి చాలా ఫీచర్లతో వచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto G Power(2022): స్పెసిఫికేషన్స్

Moto G Power(2022) స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల HD+ పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఈ ఫోన్ 9.4mm మందం మరియు 203 గ్రాముల బరువుతో కలిగివుంది. ఈ ఫోన్‌ MediaTek Helio G37 ఆక్టా కోర్ ప్రొసెసర్ తో వస్తుంది మరియు దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 128 వరకూ స్టోరేజ్ తో జతచేయబడింది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన స్టాక్ ఆండ్రాయిడ్ 11 పైన నడుస్తుంది మరియు ఎటువంటి బ్లాట్ వేర్ లేకుండా అప్డేట్స్ ను త్వరగా అందుకుంటుంది.

మోటో జి పవర్ (2022) కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంది. ఈ సెటప్ లో 50ఎంపి ప్రధాన కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ లను అందించింది. ముందుభాగంలో, 8ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది.

మోటో జి పవర్ (2022) పెద్ద 5000 mAh బ్యాటరీని నార్మల్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ లో రియర్ మౌంటెడ్ వేలిముద్ర సెన్సార్ ఇచ్చింది మరియు ఫేస్ అన్లాక్ కు కూడా సపోర్ట్ వుంది.

Moto G Power(2022): ధర

మోటో జి పవర్ (2022) USలో 4GB RAM మరియు 64GB స్టోరేజ్‌కలిగిన బేస్ వేరియంట్‌ $199 (సుమారు 14,786) మరియు 128GB స్టోరేజ్ ఎంపిక కోసం $249 (సుమారు 14,786) నుండి ప్రారంభమవుతుంది. అయితే, ఇండియాలో ఈ ఫోన్ లాంచ్ గురించి ఎంటువంటి ప్రకటనా చేయ్యలేదు.     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo