Moto G Power(2022): మెరుగైన 50MP కెమెరాతో వచ్చింది

Moto G Power(2022): మెరుగైన 50MP కెమెరాతో వచ్చింది
HIGHLIGHTS

మోటో జి పవర్ (2022) విడుదల చేసింది

4GB ర్యామ్ మరియు 1218 వరకూ స్టోరేజ్

మోటోరోలా అధికారికంగా తన Moto G Power(2022) స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది.  2021 ప్రారంభంలో ఆవిష్కరించిన Moto G Power యొక్క నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా 2022 ఎడిషన్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. మోటో జి పవర్ (2022) స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు పెద్ద బ్యాటరీ వంటి చాలా ఫీచర్లతో వచ్చింది.

Moto G Power(2022): స్పెసిఫికేషన్స్

Moto G Power(2022) స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల HD+ పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఈ ఫోన్ 9.4mm మందం మరియు 203 గ్రాముల బరువుతో కలిగివుంది. ఈ ఫోన్‌ MediaTek Helio G37 ఆక్టా కోర్ ప్రొసెసర్ తో వస్తుంది మరియు దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 1218 వరకూ స్టోరేజ్ తో జతచేయబడింది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన స్టాక్ ఆండ్రాయిడ్ 11 పైన నడుస్తుంది మరియు ఎటువంటి బ్లాట్ వేర్ లేకుండా అప్డేట్స్ ను త్వరగా అందుకుంటుంది.

మోటో జి పవర్ (2022) కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంది. ఈ సెటప్ లో 50ఎంపి ప్రధాన కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ లను అందించింది. ముందుభాగంలో, 8ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది.

మోటో జి పవర్ (2022) పెద్ద 5000 mAh బ్యాటరీని నార్మల్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ లో రియర్ మౌంటెడ్ వేలిముద్ర సెన్సార్ ఇచ్చింది మరియు ఫేస్ అన్లాక్ కు కూడా సపోర్ట్ వుంది.

Moto G Power(2022): ధర

మోటో జి పవర్ (2022) USలో 4GB RAM మరియు 64GB స్టోరేజ్‌కలిగిన బేస్ వేరియంట్‌ $199 (సుమారు 14,786) మరియు 128GB స్టోరేజ్ ఎంపిక కోసం $249 (సుమారు 14,786) నుండి ప్రారంభమవుతుంది. అయితే, ఇండియాలో ఈ ఫోన్ లాంచ్ గురించి ఎంటువంటి ప్రకటనా చేయ్యలేదు.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo