Moto G Max launch confirmed with luxury design and sony camera
Moto G Max : మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ తో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే మార్కెట్లో అన్ని విభాగాల్లో స్మార్ట్ ఫోన్ లను అందించిన మోటోరోలా ఇప్పుడు మరో ఫోన్ లాంచ్ కోసం రెడీ అయ్యింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను మోటోరోలా బడ్జెట్ సిరీస్ అయిన G Series నుండి లాంచ్ చేస్తోంది. అయితే, ఈ ఫోన్ లగ్జరీ డిజైన్ మరియు Sony ప్రీమియం కెమెరాతో లాంచ్ అవుతుందని మోటోరోలా ప్రకటించింది.
మోటో జి మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజి నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ వివరాలు కూడా విడుదల చేసింది.
మోటోరోలా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను లగ్జరీ శాటిన్ ఫినిష్ మరియు స్లీక్ డిజైన్ తో అందిస్తుంది. ఈ ఫోన్ లో 6.72 ఇంచ్ FHD రిజల్యూషన్ స్క్రీన్ ఉంటుంది. ఇది కలర్ బూస్ట్ సపోర్ట్, వాటర్ టచ్ 2.0 ఫీచర్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1050 HBM నిట్స్ బ్రైట్నెస్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ Snapdragon 6s Gen 4 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. అంతేగాదు, ఈ ఫోన్ LPDDR 5X ర్యామ్, UFS 3.2 ఫాస్ట్ రెస్పాన్స్ స్టోరేజ్ మరియు 18GB AI ర్యామ్ బూస్ట్ వంటి జబర్దస్త్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP Sony LYT 600 మెయిన్ మరియు 8MP సెకండరీ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. అలాగే, ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్ లో ఉంది. ఇది లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు ప్రత్యేకమైన మోటోరోలా కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read : Freedom Sale Mega Deal: లేటెస్ట్ 5.1.2 ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ని అతి చవక ధరలో అందుకోండి.!
మోటోరోలా ఈ ఫోన్ ను కూడా భారీ 7000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ తో లాంచ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ టర్బో ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ కూడా మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ MIL-STD 810 H సర్టిఫికేషన్ తో వస్తుంది. ఇందులో స్టీరియో స్పీకర్ సెటప్ మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అవుతుంది. ఇది 2 OS అప్గ్రేడ్ మరియు 3 సంవత్సరాల రెగ్యులర్ అప్డేట్స్ అందుకుంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ తో లాంచ్ అవుతుంది.