Moto G Max : లగ్జరీ డిజైన్ మరియు Sony ప్రీమియం కెమెరాతో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ తో మరోసారి వార్తల్లో నిలిచింది

మోటోరోలా బడ్జెట్ సిరీస్ అయిన G Series నుండి Moto G Max లాంచ్ చేస్తోంది

ఈ ఫోన్ ను లగ్జరీ డిజైన్ మరియు Sony ప్రీమియం కెమెరాతో లాంచ్ చేస్తుంది

Moto G Max : లగ్జరీ డిజైన్ మరియు Sony ప్రీమియం కెమెరాతో లాంచ్ అవుతోంది.!

Moto G Max : మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ తో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే మార్కెట్లో అన్ని విభాగాల్లో స్మార్ట్ ఫోన్ లను అందించిన మోటోరోలా ఇప్పుడు మరో ఫోన్ లాంచ్ కోసం రెడీ అయ్యింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను మోటోరోలా బడ్జెట్ సిరీస్ అయిన G Series నుండి లాంచ్ చేస్తోంది. అయితే, ఈ ఫోన్ లగ్జరీ డిజైన్ మరియు Sony ప్రీమియం కెమెరాతో లాంచ్ అవుతుందని మోటోరోలా ప్రకటించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto G Max : లాంచ్ డేట్

మోటో జి మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజి నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ వివరాలు కూడా విడుదల చేసింది.

Moto G Max : ఫీచర్స్

మోటోరోలా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను లగ్జరీ శాటిన్ ఫినిష్ మరియు స్లీక్ డిజైన్ తో అందిస్తుంది. ఈ ఫోన్ లో 6.72 ఇంచ్ FHD రిజల్యూషన్ స్క్రీన్ ఉంటుంది. ఇది కలర్ బూస్ట్ సపోర్ట్, వాటర్ టచ్ 2.0 ఫీచర్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1050 HBM నిట్స్ బ్రైట్నెస్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ Snapdragon 6s Gen 4 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. అంతేగాదు, ఈ ఫోన్ LPDDR 5X ర్యామ్, UFS 3.2 ఫాస్ట్ రెస్పాన్స్ స్టోరేజ్ మరియు 18GB AI ర్యామ్ బూస్ట్ వంటి జబర్దస్త్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Moto G Max

ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP Sony LYT 600 మెయిన్ మరియు 8MP సెకండరీ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. అలాగే, ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్ లో ఉంది. ఇది లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు ప్రత్యేకమైన మోటోరోలా కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Also Read : Freedom Sale Mega Deal: లేటెస్ట్ 5.1.2 ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ని అతి చవక ధరలో అందుకోండి.!

మోటోరోలా ఈ ఫోన్ ను కూడా భారీ 7000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ తో లాంచ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ టర్బో ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ కూడా మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ MIL-STD 810 H సర్టిఫికేషన్ తో వస్తుంది. ఇందులో స్టీరియో స్పీకర్ సెటప్ మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అవుతుంది. ఇది 2 OS అప్గ్రేడ్ మరియు 3 సంవత్సరాల రెగ్యులర్ అప్డేట్స్ అందుకుంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ తో లాంచ్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile