ఆకర్షణీయమైన ధర మరియు ఫీచర్లతో వచ్చిన మోటోరోలా కొత్త ఫోన్.!

HIGHLIGHTS

మోటోరోలా E సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

Moto E22s స్మార్ట్ ఫోన్ ను Moto E32s కు డౌన్ టోన్ వెర్షన్ గా లాంచ్ చేసింది

ఈ ఫోన్ అక్టోబర్ 22 నుండి Flipakrt మరియు అన్ని ప్రధాన రిటైల్ షాపుల్లో అమ్మకానికి వస్తుంది

ఆకర్షణీయమైన ధర మరియు ఫీచర్లతో వచ్చిన మోటోరోలా కొత్త ఫోన్.!

మోటోరోలా తన బడ్జెట్ సిరీస్ అయిన E సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది. అదే, Moto E22s స్మార్ట్ ఫోన్ మరియు ఇటీవల లాంచ్ చేసిన Moto E32s కు డౌన్ టోన్ వెర్షన్ గా ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. మోటో ఇ22s స్మార్ట్ ఫోన్ స్టైలిష్ డిజైన్, 90Hz రిఫ్రెష్ రేట్ పంచ్ హోల్ డిస్ప్లే, యాడ్స్ బెడద లేని ఆండ్రాయిడ్ 12 OS మరియు మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto E22s: ధర

Moto E22s స్మార్ట్ ఫోన్ 4GB+ 64GB వేరియంట్ ను రూ.8,999 ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ అక్టోబర్ 22 నుండి Flipakrt మరియు అన్ని ప్రధాన రిటైల్ షాపుల్లో అమ్మకానికి వస్తుంది.                         

Moto E22s: స్పెషిఫికేషన్స్

మోటోరోలా Moto E22s పెద్ద 6.5 అంగుళాల HD+ డిస్ప్లేని పంచ్ హోల్ డిజైన్ తో కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ MediaTek Helio G37 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా వేగవంతమైన LPDDR4X 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే, ఎంటువంటి యాడ్స్ బెడదా లేని బ్లోట్ వేర్ ఫ్రీ Near-Stock Android 12 OS పైన పనిచేస్తుంది.  

ఆప్టిక్స్ పరంగా, Moto E22s ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ వుంటుంది. ఇందులో, 16MP AI మైన్ కెమెరా మరియు 2MP డెప్త్ కెమెరా వున్నాయి.  సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ సైడ్- మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్లాక్ కూడా కలిగి ఉంటుది. ఈ ఫోన్ లో పెద్ద 5000 mAh బ్యాటరీని అందించింది.ఈ ఫోన్ 4G LTE, WiFi, బ్లూటూత్, FM రేడియో, 3.5mm ఆడియో జాక్ మరియు USB-C 2.0 పోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo