MIVI One 5G launching with 50mp dual rear camera and stylish design
MIVI One 5G: హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఫస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ స్టన్నింగ్ ఫీచర్స్ తో వస్తోంది. ప్రముఖ ఇండియన్ వేరబుల్ బ్రాండ్ మివి లాంచ్ చేయబోతున్న ఫస్ట్ ఫోన్ ఇది మరియు ఈ ఫోన్ ను మార్కెట్ లో పరిచయం చేయడానికి కంపెనీ చాలా రోజులుగా టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ మరియు మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక వివరాలు ఒక్కొక్కటిగా అందించింది.
మివి వన్ 5జి స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 24వ తేదీ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను లాంచ్ తర్వాత ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది. అందుకే, ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకంగా టీజింగ్ చేస్తోంది.
మివి ఈయనే 5జి ఫోన్ ను మెటల్ బాడీ తో లాంచ్ చేస్తునట్లు ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ చూస్తే అనిపిస్తుంది. కానీ, కంపెనీ అధికారికంగా ఈ ఫీచర్ గురించి వివరాలు అందించ లేదు. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ లో ఉంటుంది మరియు ఫ్లాట్ డిజైన్ లో వస్తుంది. ఈ ఫోన్ లో సింగిల్ స్పీకర్ ఉన్నట్లు ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా క్లియర్ అవుతుంది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ Snapdragon 5జి చిప్ సెట్ తో అందిస్తుంది. ఈ ఫోన్ ను Snapdragon 4 Gen 2 చిప్ సెట్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ తో వచ్చే అవకాశం ఉంది మరియు ఇది యాడ్స్ బెడద లేని విధంగా ఉండవచ్చు. ఈ ఫోన్ లో బిగ్ బ్యాటరీని ఎక్స్పెక్ట్ చేయవచ్చని. మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో 6000 mAh నుంచి 6500 mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉడొంచని అంచనా.
ఈ ఫోన్ సెటప్ గురించి కంపెనీ అఫీషియల్ గా వెల్లడించింది. ఈ ఫోన్ లో 50MP డ్యూయల్ రియర్ కెమెరా ఉందని మివి తెలిపింది. ఇది మంచి ఫోటోలు మరియు వీడియోలు అందించే సత్తా కలిగి ఉంటుందని కూడా మివి తెలిపింది. ఈ ఫోన్ లో 128GB హెవీ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ మరియు సరికొత్త కలర్స్ లో లాంచ్ అవుతుంది.
Also Read: Lava Bold N4 Pro 5G: రేపు లాంచ్ అయ్యే బడ్జెట్ బిగ్ బ్యాటరీ ఫోన్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.!
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఇప్పుడు మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే, ఈ ఫోన్ ఇండియన్ కంపెనీ విడుదల చేయడం మరియు ఈ కంపెనీ విడుదల చేస్తున్న మొదటి ఫోన్ కావడంతో, ఇది చాలా రీజనబుల్ అండ్ అగ్రసివ్ ప్రైస్ లో లాంచ్ అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే, ఈ ఫోన్ ను రూ. 15,000 నుంచి రూ. 18,000 రూపాయల ప్రైస్ బ్రాకెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉండొచ్చని మేము అంచనా వేస్తున్నాము.