Micromax In 2b: గేమింగ్ ప్రొసెసర్ తో వస్తున్న మైక్రోమ్యాక్స్ స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

మైక్రోమ్యాక్స్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్

Micromax In 2b లాంచ్ డేట్ ఫిక్స్

టీజర్ ను కూడా విడుదల చేసింది

Micromax In 2b: గేమింగ్ ప్రొసెసర్ తో వస్తున్న మైక్రోమ్యాక్స్ స్మార్ట్ ఫోన్

భారతీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. జూలై 30వ తేది మధ్యాహ్నం 12 గంటలకు Micromax In 2b స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క టీజర్ ను కూడా విడుదల చేసింది. ఈ ఫోన్ Flipkart నుండి సేల్ చేయబడుతుంది. ఎందుకంటే, ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ కోసం ఇప్పటికే తన ఆన్లైన్ ప్లాట్ఫారం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Micromax In 2b స్మార్ట్ ఫోన్ వాటర్ డ్రాప్ డిస్ప్లే డిజన్ కలిగివుంది. ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా మరియు ఫ్లాష్ సెటప్ కలిగివుంది. ఈ ఫోన్ పెద్ద 5,000mah బ్యాటరీ, వేగవంతమైన చిట్ సెట్ మరియు వెనుక ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నట్లు మైక్రో మ్యాక్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ ఫోన్ లో GPU G52 గ్రాఫిక్స్ ఉన్నట్లు మైక్రోమ్యాక్స్ టీజింగ్ లో చూపించింది. అంటే, ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో G70 లేదా G80 ప్రొసెసర్ ఉండే అవకాశం వుంది.

ఈ ఫోన్ మూడు కలర్స్ లో అందించే అవకాశం కూడా ఉంది. టీజింగ్ ఫోటోలో ఈ ఫోన్ బ్లూ, బ్లాక్ మరియు గ్రీన్ వంటి మూడు రంగులలో కనిపిస్తోంది. అందుకే, ఈ ఫోన్ ఈ మూడు కలర్ అప్షన్లలో రావచ్చు. డిజైన్ పరంగా ఈ ఫోన్ బాగానే కనిపిస్తోంది మరియు స్లిమ్ బెజెల్స్ కూడా ఆశించవచ్చు. మరో రెండు రోజుల్లో విడుదల అవుతున్న ఈ స్మార్ట్ ఫోన్ వివరాలను బట్టి బడ్జెట్ ప్రియులను దృష్టిలో ఉంచుకొని ధరను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo