Micromax In 2b: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ భారీ ఆఫర్లతో ఫస్ట్ సేల్
Micromax In 2b ఫస్ట్ సేల్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి In 2b ఫస్ట్ సేల్
ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకోండి
ఇండియన్ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ నుండి లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Micromax In 2b ఫస్ట్ సేల్ ఆగష్టు 6 న జరుగుతుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో జరుగుతుంది. అందుకే, ఈ స్మార్ట్ ఫోన్ భారీ ఆఫర్లతో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఆగష్టు 5వ తేదీ నుండి ఆగష్టు 9వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. అలాగే, Micromax In 2b ఫస్ట్ సేల్ ఆగష్టు 6వ తేదీ మద్యహ్నం 12 గంటలకి స్టార్ట్ అవుతుంది.
Surveyఇక ఆఫర్ల విషయానికి వస్తే, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి ఈ మైక్రోమ్యాక్స్ స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలుచేసే కస్టమర్లకు 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ను ఎక్స్చేంజ్ అఫర్ తో కొనేవారికి 2,500 రూపాయల వరకు అధనపు తగ్గింపు అఫర్ చేస్తోంది. రూ. 300 రూపాయల కంటే తక్కువ EMI అప్షన్ తో కూడా ఈ స్మార్ట్ ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఇవి మాత్రమే కాదు, మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి అందించింది.
Micromax In 2b: ప్రైస్
మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి బేస్ వేరియంట్ 4జిబి ర్యామ్/ 64జిబి స్టోరేజ్ కలిగి కేవలం రూ.7,999 ప్రారంభ ధరతో వచ్చింది. ఇక మరొక వేరియంట్ 6జిబి ర్యామ్/ 64జిబి స్టోరేజ్ కలిగి రూ.8,999 ధరతో ప్రకటించబడింది. మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి బ్లాక్, బ్లూ మరియు గ్రీన్ వంటి మూడు విభిన్నమైన కలర్స్ లో లభిస్తుంది.
Micromax In 2b: స్పెక్స్
మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.52 ఇంచ్ HD+ డిస్ప్లే తో వస్తుంది మరియు ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ డిజైన్ కలిగి ఉంటుంది. మిట్టమధ్యాహ్నం ఎండలో కూడా చక్కగా కనిపించేలా ఈ డిస్ప్లే 400 నైట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ మైక్రోమ్యాక్స్ స్మార్ట్ ఫోన్ Unisoc T610 ఆక్టా కొర్ ప్రొసెసర్ మరియు 6జిబి ర్యామ్ తో జతగా వస్తుంది. SD కార్డు సహాయంతో 256 జిబి వరకూ స్టోరేజ్ మరితంగా విస్తరించవచ్చు.
కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో రెండవ లెన్స్ 2మెగాపిక్సెల్ లెన్స్ వుంటుంది. ఈ కెమెరా సెటప్ నైట్ మోడ్, పోర్ట్రైట్, మోషన్ ఫోటో మరియు బ్యూటీ ఫోటో వంటి ఫీచర్స్ సపోర్ట్ తో వస్తుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి పెద్ద 5000 mah బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ టెక్నాలజీతో కలిగివుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile