Mi ఫ్యాన్ ఫెస్టివల్ 2019 : mi ప్యాక్స్, 1రూ ఫ్లాష్ సేల్, మిస్టరీ బాక్స్ ఇంకా మరెన్నో

HIGHLIGHTS

షావోమి తన MFF 2019 (మి ఫ్యాన్ ఫెస్టివల్ ) ని ఏప్రిల్ 4వ తేది నుండి ప్రారంభించనుంది.

ఈ ఫెస్టివల్ సేల్ నుండి అనేకసార్లు సేల్ జరగవచ్చని అంచనావేయవచ్చు.

HDFC యొక్క కార్డ్స్ మరియు EMI ట్రాన్సాక్షన్స్ పైన 5% తక్షణ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

Pay & Win అఫర్ క్రింద రెడ్మి నోట్ 7 మరియు రెడ్మి టివీ లను ఉచితంగా గెలుచుకోవచ్చు.

షావోమి తన MFF 2019 (మి ఫ్యాన్ ఫెస్టివల్ ) ని ఏప్రిల్ 4వ తేది నుండి ప్రారంభించనుంది. ఈ సందర్భంగా, అనేక డీల్స్ అఫర్ మరియు ఫన్ గేమ్స్  షావోమి సంస్థ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. అంతేకాకుండా, HDFC యొక్క కార్డ్స్ మరియు EMI ట్రాన్సాక్షన్స్ పైన 5% తక్షణ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అలాగే, Mi Pay ద్వారా క్యాష్ చెల్లించడంతో రెడ్మి నోట్ మరియు Mi టీవీలను గెలుచునే అవకాశం కూడా దక్కుంతుంది.

ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఫ్లాష్ సేల్ నుండి రెడ్మి నోట్ 7 ప్రో కొనలేకపోయిన వారికి శుభవార్త. ఈ మి ఫ్యాన్ ఫెస్టివల్ ద్వారా రెడ్మి నోట్ 7 ప్రో యొక్క ఫ్లాష్ సేల్ ఇక వరుసగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, మి వెబ్సైటు లో చూపిన ప్రకారం, ఏప్రిల్ 3వ తేదికి మరొక ఫ్లాష్ సేల్ జరగనుండగా, ఏప్రిల్ 4 వ తేదికి కూడా ఫేస్ సేల్ జరగనుననిల్తు చెబుతోంది. అంటే, ఈ ఫెస్టివల్ సేల్ నుండి అనేకసార్లు సేల్ జరగవచ్చని అంచనావేయవచ్చు.

అలాగే, రెడ్మి 6 సిరీస్ స్మార్ట్ ఫోన్లయినటువంటి, 6, 6A, 6Pro మరియు నోట్ 6 ప్రో వంటి అన్ని స్మార్ట్ ఫోన్ల పైన కూడా గొప్ప డిస్కోట్లను ప్రకటించింది. ఇంకా, బడ్జెట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్లయినటువంటి, రెడ్మి నోట్ 5 ప్రో మరియు మి A2 పైన కూడా అంకఞ్హి డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే, 1 రూపాయి ఫ్లాష్ సేల్లో భాగంగా, ఇటీవలే ఇండియాలో కొత్తగా తీసుకొచ్చినటువంటి మి సౌండ్ బార్ ని అఫర్ గా అందుకునే అవకాశాన్ని కూడా చూపిస్తోంది. ఇవేకాకుండా, మరెన్నో ఆశ్చర్యకరమైన గిఫ్టులను కూడా అందించనుంది.   

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :